మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, Accident in mancherial district

Accident in mancherial district మందమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృత దేహాలు ప్రమాద స్థలంలో చల్ల చడురుగా పడి ఉన్నాయి.

 ప్రమాద స్థలంలో పడి ఉన్న మృతదేహాలు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి మృతుల్లో తల్లీకూతుళ్లు , బంధువు  శుభకార్యానికి వెళ్లిన ముగ్గురు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు . లాక్ డౌన్లో రవాణా సౌకర్యం లేకపోవడంతో తల్లీ కూతురు , మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది . ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు . ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం కెకె ఒసిపి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది .

తల్లిగారింట్లో జరిగిన వివాహ వేడుకలకు లక్సిట్టిపేటకు చెందిన పోతరాజుల సుజాత ( 40 ) , కూతురు కావ్య ( 18 ) పది రోజుల క్రితం హాజరయ్యారు . శుభ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత గురువారం తెల్లవారు జామున గంటల ప్రాంతంలో తమ కుటుంబానికి చెందిన బాకం కొమురయ్య ( 48 ) తో కలిసి బైక్ పై బయలు దేరారు . కొమురయ్య సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు . మంచిర్యాల వైపునకు వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం దీని అక్కడికక్కడే మృతి చెందారు . మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న మృతురాలి భర్త వీడియో కాల్ ద్వారా భార్య , కూతురు అంత్యక్రియలు చూసి కన్నీటి పర్యంతమయ్యాడు . పట్టణ సిఐ ఎడ్ల మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం లక్షేట్టిపేటకు చెందిన పోతరాజుల సుజాత ( 40 ) , కావ్య ( 18 ) తల్లీకూతుర్లు . వారు బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు . తిరుగు ప్రయాణంలో వారి బంధువు బాకం కొమురయ్య ( 48 ) తో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు . Accident in mancherial district వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు .

 మృతుడు కొమురయ్య సింగరేణిలోని సెక్యూరిటీ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగి . సుజాతకు భర్త శ్రీనివాస్ , ఇద్దరు కుమార్తెలున్నారు . పెద్ద కుమార్తె కావ్య మృతిచెందారు . శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లాడు . మృతదేహాలకు మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేశారు . బంధువులు నిర్వహించిన తల్లీకూతుళ్ల ఆంత్యక్రియలను శ్రీనివాస్ వీడియోకాల్ ద్వారా చూసి గుండెలవిసేలా రోదించాడు . కేసు దర్యాప్తు చేస్తున్నారు . 

Related Articles

Back to top button