తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం, Accident in Telangana state

Accident in Telangana state రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఆగి ఉన్న టిప్పర్ ను స్కార్పియో ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు . మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది . ఈ ఘటన డిచ్ పల్లి మండలం నాకతండాలో ఎన్ హెచ్ 44 పై తెల్లవారుజామున జరిగింది . 

 వివరాల్లోకి వెళ్తే కేరళ రాష్ట్రం ఉడిపి జిల్లాకు చెందిన పలువురు బీహార్ రాష్ట్రం నవాడ జిల్లాలో సెయింట్ థెరిస్సా ఇంగ్లీషు మీడియం స్కూల్ నడుపుతున్నారు . కాగా , లాక్ డౌన్ నేపథ్యంలో కేరళ వెళ్లేందుకు ఈ నెల 13 న మధ్యాహ్నం మూడు వాహనాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు . శనివారం తెల్లవారుజామున డిపల్లి మండలం నాకతండా శివారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పరు వారి స్కార్పియో బలంగా ఢీకొట్టింది . కారులో ఉన్న ఐదుగురిలో స్టాలిన్ ( 21 ) , అనిశ్ థామస్ ( 32 ) , అనాలియా ( 2 ) అక్కడికక్కడే మృతిచెందారు . దివ్య , అజలియకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు . అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు .

Accident in Telangana state ::

 వారి సంబంధీకులు అనుతోమస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు . రెండ్రోజుల నుండి నిరంతరాయంగా ప్రయాణం చేస్తుండటంతో డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు . నిర్మలో లారీ బోల్తా  లాక్ డౌ తో అవస్థలు పడుతున్న వలస కార్మికులు  ఉన్న ఊరిలో ఏ గంజో తాగిబతుకుతామంటూ  సొంతూర్లకు పయనమైన క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు . తాజాగా శనివారం నిర్మల్ జిల్లాలో వలస కూలీల లారీ బోల్తాపడి 20 మంది గాయపడ్డారు . నిర్మల్ జిల్లా కొండాపూర్ వద్ద వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది . హైదరాబాద్ మేడ్చల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది . లారీలోని 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి . వారిని నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు .

Related Articles

Back to top button