లాక్ డౌన్ మళ్లీ పొడిగింపు! Central govt again extend lock down

మే 3 తర్వాత Central govt again extend lock down లాక్ డౌన్ పొడిగింపుకు అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని అదే మేలని రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయ పడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

  దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల మే 3 తర్వాత లాక్ డౌను పొడిగిస్తామని , రెడ్ జోన్లు , కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు కేంద్రంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు .

 బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్  పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయని చెప్పారు . కరోనాని అరికట్టేందుకు పూర్తి స్థాయిలో Central govt again extend lock down మే 3 తర్వాత పొడిగించాలని కేంద్రం భావిస్తోందని  తెలిపారు . కొన్ని రాష్ట్రాలలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాణాలు కాపాడుకోవ డానికి , దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజప్తి చేశారు .

 కరోనాపై చేస్తున్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారాలని పిలుపునిచ్చారు . పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులూ ఉండవని , గ్రీన్ జోన్లలో మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు . బస్సు ప్రయాణాలు , రైలు , విమాన ప్రయాణాలు , షాపింగ్ మాల్స్ , సినిమా హాల్స్ వంటి వాటికి తప్ప మిగతా వాటికి మినహాయింపులు ఉండచ్చన్నారు .

కరోనా మహమ్మారి నీ ఎలా తగ్గించాలనే దానిపై దృష్టితో చైనా నుంచి వచ్చిన టెస్ట్ కిట్లు నాసిరకంగా ఉండడం వల్ల వాటితో మాత్రమే పరీక్షలు నిర్వహించట్లేదని , మిగతా దేశాల నుంచి వచ్చిన టెస్టింగ్ కిట్లను యథావిధిగా కొనసాగిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు . ఇప్పటి వరకు కిట్ల కోసం చైనాకు ఒక్క రూపాయి కూడా ఇండియా చెల్లించలేదని వివరించారు .

 దేశంలో 350కి పైగా కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు . సీఎం కేర్స్ నిధిలో ఉన్న డబ్బులో ఎక్కువశాతం వ్యాక్సిన్ కనిపెట్టేందుకే ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు . అన్ని దేశాలతో పాటే ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో మాట్లాడతారే తప్ప కరోనా ఎక్కడ పుట్టిందనే దాని మీద దృష్టి పెట్టలేదని స్పష్టం చేశారు .

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు సహకారం అందిస్తాం అన్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మత్స్యకారులను గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని , రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి వారిని స్వస్థలాలకు పంపించామని కేంద్ర మంత్రి చెప్పారు . రాజస్థాన్లోని కోటలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి తీసుకెళ్లడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో కూడా చర్చించామని వెల్లడించారు . 

Related Articles

Back to top button