తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు, Coronavirus cases decreasing in TS

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అత్యధిక కేసులు నమోదైన , విస్తరణ జరిగిన నాలుగు జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది . Coronavirus cases decreasing in TS గ్రేటర్ హైదరాబాద్ , సూర్యాపేట , జోగులాంబగద్వాల , వికారాబాద్ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ప్రభుత్వం కరోనా వైరస్ చైనన్ను బ్రేక్ చేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది .

 ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ ఆయా జిల్లాలో , కంటైన్మెంట్ జోనల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి ఎప్పటికపుడు సూచనలు అందిస్తున్నారు . మొత్తం కేసులలో సింహభాగం నాలుగు జిల్లాల్లోనే నమోదు కావడం , ఇవి కూడా తక్కువ కుటుంబాల్లోనే జరగడంతో గట్టిగా కట్టడి చేస్తే వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని విస్తరణ ఆపవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది .

 కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని , హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్లే Coronavirus cases decreasing in TS విస్తరణకు బ్రేక్ లు పడ్డాయని అధికారవర్గాలు అంటున్నాయి .

 ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్న సంకేతాలుండగా , ప్రతిరోజూ 40 నుండి 50మంది డిశ్చార్జి అవుతున్నారు . ఇదే పద్ధతి ప్రకారం కొనసాగితే మే 1కి కేవలం 200 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఉంటారన్న అంచనాను ప్రభుత్వం చెబుతోంది .

 శనివారం రాత్రికి కేసుల సంఖ్య 990గా ఉండగా , ఇందులో నాలుగు జిల్లాలకు చెందిన కేసులే దాదాపు 70శాతం . గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 491 , గద్వాల 49 , వికారాబాద్లో 38 కేసులు రాగా వీటిపై కుటుంబాల వారీగా కాంటాక్ట్ ట్రేస్ చేస్తూ చైను బ్రేక్ చేస్తున్నారు .

 అధికారులు కట్టుదిట్టచర్యల ఫలితంగా శనివారం సూర్యాపేట , గద్యాల , వికారాబాద్లలో కేసులు నమోదుకాలేదు . గ్రేటర్ హైదరాబాద్లో కూడా రోజుకు 40 , 50 కేసులు వచ్చిన పరిస్థితి నుండి ఐదారు కేసులకు పరిస్థితి వచ్చింది . తొలి నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్న కఠిన నిర్ణయాలనే వైరస్ తగ్గినా మరో పది రోజుల పాటు అంతే కఠినంగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించినట్లు తెలుస్తోంది .

Related Articles

Back to top button