మళ్లీ లాక్ డౌన్ కు KCR సంకేతాలు, KCR to implement lockdown
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. KCR to implement lockdown జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు . ఇక్కడ కొద్ది రోజులపాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం వెల్లడించారు .
హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం . దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం . లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత , ప్రజల కదలిక పెరిగింది . దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది . తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు . దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి .
KCR to implement lockdown ::
హైదారాబాద్లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి . అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది . ప్రభుత్వ యంత్రాంగాన్నీ , ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది . ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి . కేబినెట్ సమావేశ పరచాలి . అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది .
రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం . అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో క్యాబినెట్ను సమావేశ పరిచి , జిహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను , ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం . ఈ పరిధిలో లాక్ డౌన్ విధించాల్సి వస్తే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది . లాక్ డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా , సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుంది . నిత్యావసర సరుకులు కోనుగోళు చేసుకోవటానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుంది . విమానాలు , రైళ్ల రాకపోకలను ఆపాల్సివుంది . ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది . కాబట్టి అన్ని విషయాలలోనూ లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది ‘ అని కెసిఆర్ వివరించారు .