భారత్ లో విజృంభిస్తున్న కరోనా,ఒకే రోజులో 909, India coronavirus tally 8447
కరోనా వైరస్ మహమ్మారి ఎంతకీ భారత్ ను వదలడం లేదు . చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని రంగాల వారిని కాటేస్తోంది. India coronavirus tally 8447 కోవిడ్ – 19 రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులు , నర్సులను కూడా మహమ్మారి వదలడం లేదు . దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి .
దేశంలో కరోనా కేసులు రాష్ట్రాల వారీగా:
India coronavirus tally 8447 ::
- తమిళనాడులో ఒకే రోజు 106 కేసులు నమోదయ్యాయి . దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్క్ ను దాటేసింది . ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1,075కు చేరుకుందని తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ తెలిపారు . ఇప్పటి వరకు 11 మంది చనిపోయారని వివరించారు .
- జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం కొత్తగా 21 కేసులు వెలుగు లోకొచ్చాయి . దీంతో కరోనా బాధితుల సంఖ్య 245కు చేరు కుంది . 17 కాశ్మీర్ డివిజన్ నుంచి , 4 జమ్మూ డివిజన్ నుంచి వెలుగులోకొచ్చాయి .
- పంజాబ్లోని పటియాలా పోలీసులపై దాడిని సీఎం అమరింద ర్ సింగ్ ఖండించారు . ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది . కొందరు దుండగులు ఉదయం వాహనంలో వచ్చి . . బ్యారేకేడ్లను కొట్టారు . లాక్ డౌన సమయం లో ఎందుకు బయటికొచ్చారని ప్రశ్నించగా పోలీసులపై తిరగబడి దాడి చేశారు ఓ వ్యక్తి పోలీస్ పై కత్తితో దాడి చేయడంతో అతని చేయి తెగిపడిపోయింది . మరికొందరు తీవ్రం గా గాయపడ్డారు . కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీఎం ప్రకటించారు . కరోనా కేసులు పంజాబ్ లో 170కు చేరుకున్నాయి.
- చండీగఢ్ లో మరో రెండు కేసులు పాజిటివ్ గా నమోద య్యాయి . దీంతో బాధితుల సంఖ్య 21కు చేరుకుంది . ఆదివారం 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.
India coronavirus tally 8447 ::
- కర్నాటకలో కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి . దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 232కు చేరుకుంది . 6గురు చనిపోగా. 54 మంది డిశ్చార్జ్ అయినట్టు వైద్యులు తెలిపారు . ఆదివారం విజయపుర జిల్లాలో ఐదుగురికి పాజిటివ్ తేలింది .
- కేరళలో 36 మంది రికవరీ అయి ఇంటికి చేరుకున్నారు . ఆదివారం కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి . దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 194కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజ తెలిపారు . 1 ,16 ,941 మందిని క్వారంటైన్లో ఉంచామని , 816 మంది ఆస్పత్రిలో , 14 , 989 మంది శాంపిళ్లు సేకరించి పరీక్షించగా 13,082 మందికి నెగిటివ్ వచ్చినట్టుసీఎం పినరయి విజయన్ తెలిపారు.
- ఢిల్లీలో 34 వైరస్ హాట్‌స్పాట్లను గుర్తించినట్టు సీఎం అరవింద్ కేజీవాల్ తెలిపారు . అన్ని చోట్ల శానిటైజేషన్ పనులు చేపడుతన్నట్టు వివరించారు .
- హిమాచల్ ప్రదేశ్ లో కొత్తగా 2 కేసులు వెలుగులోకొచ్చాయి . వీరిని తల్లిగీ జమాత్ తో సంబంధం ఉన్నవారే అని ప్రభుత్వం తేల్చింది . దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరుకుంది.
- మహారాష్ట్రలోని నాసిక్ లో 18 కొత్త కేసులు రిజిస్టర్ కాగా బాధితుల సంఖ్య 31కు చేరుకుంది . రానేలోని భీవండిలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది . 62 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ వచ్చింది . నాగపూర్ లో కొత్తగా 14 కేసులు వెలుగులోకి వచ్చాయి . మహారాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది . ముంబైలోని తాజ్ హోటల్ ఆరుగురు సిబ్బందికి కరోనాసోకింది . వీరిని బాంబే ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు .
- రాజస్థాన్లో 96 కొత్త కేసులు పాజిటివ్ వచ్చాయి . దీంతో మొత్తం బాధితుల సంఖ్య 796కు చేరుకుంది .
- ఉత్తర్ ప్రదేశ్లో ఆదివారం 28 కేసులు కొత్తగా నమోదయ్యాయి . దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 480కు చేరుకుంది .
3 Comments