తెలంగాణలో 130 హాట్ స్పా ట్లు, దిగ్బంధనం, 130 hotspots in Telangana state

కరోనావైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది . కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న 130 hotspots in Telangana state ప్రాంతాలను హాట్ స్పా ట్లుగా గుర్తించింది . హాట్ స్పాట్ ప్రాంతాల్లో బారికేడ్లు కట్టి అష్టదిగ్బంధనం చేసింది.

 ఈ నేపథ్యంలో 130 hotspots in Telangana state ప్రాంతాల్లో జనజీవనం ఎలా ఉంటుందన్నది ఆసక్తి కరంగా మారింది . ముందుగా హాట్ స్పాట్ ప్రాంతాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.

 ఆ ప్రాంతానికి దాదాపు కిలో మీటరు ప్రాంతంలో ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు . జన సంచారం పూర్తిగా నిషిద్ధం . సూటిగా చెప్పాలంటే ఆ ప్రాంతం మొత్తం హోం క్వారంటైన్ చేస్తారు . ఈ ప్రాంత వాసులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావడానికి లేదు . ఆ ప్రాంత వాసులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు .

 ఏదైనా అత్యవసరమయితే పోలీసులుకు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది . అందుకు ప్రత్యేకంగా నంబర్లు ఇస్తారు . 130 hotspots in Telangana state ప్రాంతాలను సాధారణంగా 14 రోజులపాటు తమ ఆధీనంలోకి తీసుకుంటారు . ఇంటింటి సర్వే చేస్తారు . అనుమానితులకు పరీక్షలు చేస్తారు.

 ఈ 14 రోజుల్లో ఏ మాత్రం పాజిటివ్ కేసులు వెలుగు చూసినా మరో 14రోజులు దిగ్బంధనం పెంచుతారు . రోజూ నిత్యావసరాలు ఇంటికే వస్తాయి . ఈ బాధ్యతలన్నీ జిల్లా కలెక్టర్లు , మార్కె టింగ్ , పౌరసరఫరాలశాఖలతోపాటు బల్దియా సమన్వయం చేసుకుంటూ పోలీసుల సమక్షంలో పంపిణీ చేస్తారు .

ఇప్పటికే హైదరాబాద్లో 12 ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది . హాట్ స్పాట్ ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ మాత్రమే కాదు ఆప్రాంతాన్నంతటినీ డేగ కళ్లతో పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ కనిపెట్టుకుంటూ ఉంటుంది . సాంకేతిక పరిజ్ఞానం సాయంతో హాట్‌స్పాట్ ప్రాంతంపై పోలీసులు పట్టు బిగిస్తారు.

 గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో నగరంలో 12చోట్ల కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు . రాంగోపాల్‌పేట , మూసాపేట , మలక్ పేట , షేర్‌పేట , లక్డీ కాపూల్ క్లస్టర్ కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు . అత్యవసర సేవల పరిధి లోకి వచ్చే వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.

 హాట్ స్పాట్ ఏరియా వ్యక్తులకు నిత్యావసరాలను మొబైల్ వ్యాన్ల ద్వారా ఇళ్ల వద్దకే చేరుస్తారు . రాకపోక లను పూర్తిగా కట్టడి చేస్తారు . ఉదయం వేళల్లో మొబైల్ వెజిటెబుల్ వాహనాలను హాట్ స్పాట్ ఏరియా ప్రాంతాల్లోకి పంపిస్తున్నారు. 

 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చినా కంట్రోల్ రూమ్ నుండి స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తారు .

Related Articles

Back to top button