భారత్ లో కరోనా వైరస్ కల్లోలం, CoVID19 rapidly increasing in India

 భారత్ లో కరోనా వైరస్ కల్లోలం, CoVID19 rapidly increasing in India కరోనా వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతోంది . దీంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . గడిచిన 24 గంటల్లో 1 , 813 కేసులు నమోదుకాగా , 71 మంది కరోనావైరస్ సోకి మృతి చెందారు . 770 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకు ని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదలలో పేర్కొంది .

 దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 31 , 332 కాగా , 1008 మంది మృతి చెందారు . 7 , 695 మంది పూర్తిగా కోలుకున్నారు . ఇందులో 111 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది . గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ తో 71 మంది మృతి చెందగా , ఇందులో మహారాష్ట్ర 31 , గుజరాత్ 19 , మధ్య ప్రదేశ్ – 1 , రాజస్థాన్ 5 , ఉత్తర్ ప్రదేశ్ 3 , పశ్చిమబెంగాల్ 2 , జమ్మూకాశ్మీర్ , పంజాబ్ , తమిళనాడుల్లో ఒక్కొక్కరు మృతులు ఉన్నారు .

 దేశవ్యాప్తంగా 288 ప్రభుత్వ లేబొరేటరీలు 997 ప్రయివేటు లాబొరేటరీలు దాదాపు 16వేల శ్యాంపుల్స్ సేకరణ కేంద్రాల ద్వారా రోజుకు 60 వేల రక్త నమూనాలుసేకరిస్తూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లూ కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు అయినా కూడా CoVID19 rapidly increasing in India వచ్చే కొద్ది రోజుల్లో రోజుకు లక్ష టెస్టులకు చేరుకుంటామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు . పంజాబ్ లో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 3వ తేదీన ముగియనున్న లాక్ డౌన్ను మరో రెండు వారాలపాటు పొడిగిస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు . అయితే కొన్నింటికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు .

  కోల్‌కతాలో ఓం ప్రకాశ్ ( 68 ) ఐరన్ మర్చంట్  కరోనా వైరస్ అనుమానంతో రక్తనమూనాలు సేకరించారు పాజిటివ్ గా తేలింది . ఆస్పత్రిలో చేర్చారు . మరుసటి రోజు టెస్ట్ చేశారు . నెగిటివ్ వచ్చింది . డిశ్చార్జ్ షీట్లోనే అదే విషయం రాసి ఇంటికి పంపి , హోం క్యారంటైన్లో ఉండమని చెప్పారని అతని కుమారుడు రాజ్ గుప్తా తెలిపారు . ఆ మరుసటి రోజే ఆస్పత్రి నుంచి ఫోన్ చేసి మీ నాన్నకు కరోనా ఉందని చెప్పారు . దీంతో తక్షణమేనాన్నను ఆస్పత్రికి తరలించాం , చికిత్స పొందుతూ కన్నుమూశారని రాజ్ గుప్తా తెలిపారు . ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే మా నాన్న మృతి చెందారని , దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి , న్యాయం చేయాలని రాజ్ గుప్తా డిమాండ్ చేశారు .

Related Articles

Back to top button