తెలంగాణలో 503 కు చేరిన కరోనా కేసులు, Telangana coronavirus tally 503

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. మొత్తం Telangana coronavirus tally 503 శుక్రవారం 16 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం కూడా మరో 16 కొత్త పాజిటివ్ కేసులు నమో దయ్యాయి .
శనివారం నమోదైన 16 పాజిటివ్ కేసుల తో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య Telangana coronavirus tally 503 చేరింది . ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెనను విడుదల చేసింది . మరోవైపుకరోనాసోకిన మృతిచెందిన వారి సంఖ్య కూడా 14కు చేరింది.
శుక్రవారం వరకు కోవిడ్ – 19 మరణాలు 12గా ఉండగా శనివారం మరో ఇద్దరు మృతి చెందారు . అయితే కరోనాతో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య తగ్గడం సంతోషించదగిన పరిణామమని వైద్యులు చెబుతున్నారు . శుక్రవారం వరకు కరోనాతో చికిత్స పొందుతున్న వారు 480 ఉండగా శనివారానికి వారి సంఖ్య 393కు పడిపోయింది .
కరోనా వైరస్ బారిన పడి కోలుకుని శనివారం ఒక్కరోజే 51మంది డిశ్చార్జి అయ్యారు . ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకుని 96 మంది డిశ్చార్జి అయ్యారు . శనివారం రాత్రికి 398మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1200మందిని గుర్తించారు . ఆసీఫాబాద్లో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి ఇంట్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది . మర్కజ్ వెళ్లిచ్చిన తండ్రికి నెగిటివ్ రాగా ఆయన ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ వచ్చింది .
కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు . తాజాగా 31 మందికి నెగిటివ్ వచ్చింది . శనివారం మరో 21 రిపార్టులను ల్యాబ్ కు పంపించారు . ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసునమోదైంది . పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లికి చెందిన 27 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు . ఖమ్మం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయినట్లు కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ ప్రకటించారు .
శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యయాయన్నారు . పెద్దతండా , ఖిల్లాతోపాటు మోతీ నగర్ ను కూడా కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించినట్లు చెప్పారు . కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారికి నిత్యావసరాలు , కూరగాయలు ఇంటికే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు .
Telangana coronavirus tally 503 వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రచయితలు , కవులు , కళాకారులు పాటలు , కవితలతో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు .
2 Comments