దారుణంగా భార్యని హత్య చేసిన భర్త, Husband murdered his wife

Husband murdered his wife భార్యను కడతేర్చిన భర్త ,అక్రమ సంబంధం అనుమానంతో భార్యను భర్త హతమార్చిన సంఘటన కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామంలో శని వారం అర్ధరాత్రి చోటుచేసుకుంది .

 శాలిగౌరారం రూరల్ సీఐ నాగదురా ప్రసాద్ , మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన పెండెం కృష్ణకు నారె గూడెం కు చెందిన బలూరి పార్వతమ్మ , లింగయ్య దంపతుల కుమార్తె ప్రభ ( 86 ) తో 20 సంవత్సరం క్రితం వివాహం జరిగింది . 

భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసు కుంటూ నారెగూడెంలో జీవనం సాగిస్తున్నారు . ఈ దంపతులకు కుమార్తె , కుమారుడు ఉన్నారు . మూడు రోజుల క్రితం కుమార్తె పామనగుండలోని బంధువుల ఇంటికి వెళ్లగా కుమారుడు నారె గూడెం లోని అమ్మమ్మ ఇంటికి శనివారం వెళ్లాడు .

 భార్యా భర్తలు ఇంటి ఆవరణలో ఆరుబయట మంచంపై నిద్రిసున్నారు . కాగా గత కొంతకాలంగా కృష్ణ తాగుడుకు బానిసై భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందనే అనుమానంతో గాఢ నిద్రలో ఉన్న భార్య Husband murdered his wife తలపై బండరాయితో బలంగా కొట్టడ్డంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది .

 దీంతో భార్య మృతదేహాన్ని బస్తాలో పెట్టి ఇంటి ఆవరణలో గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు . ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మంచం దగ్గర రక్తపు మరకలు కనబడకుండా మట్టిని తొలగించి మృతదేహం పూడ్చి పెట్టిన ప్రాంతంలో పోసి పై భాగం లో కట్టెలను పేర్చి కంప వేశాడు .

 ఆదివారం ఉదయం 9 గంటలకు మృతురాలి తల్లి ఇంటికి వచ్చే సరికి వాకిలిలో కళాప్తి చల్లలేదు . అనుమానంతో పరిశీలించగా ఆరుబయట రక్తపు మరకలు కనబడ్డాయి . దీంతో స్థానిక సర్పంచు సమాచారం ఇవ్వడం తో ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు .

 నల్ల గొండ డిఎస్పీ వెంకటేశ్వ రావు , సీఐ దురాప్రసాద్ , ఎస్ ఐ ప్రసాదు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు . వీఆర్ వో వీరయ్య మృతదేహానికి పంచనామా నిర్వహించారు . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు . మృతురాలి తల్లి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు .

Related Articles

Back to top button