ఇకపై వన్ నేషన్ వన్ రేషన్ కార్డు! Govt to issue nation one ration card !

 వలస కార్మికుల ఇబ్బందులు వారు పడుతున్న ఆకలి వేదన పై దాఖలైన పిటిషన్ పై Govt to issue nation one ration card అనే అంశాన్ని మరియు ఆర్థిక స్థితగతులను దృష్టిలో పెట్టుకుని మంగళవారం కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక సలహా ఇచ్చింది .

 లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలాది మంది కార్మికు లు స్వస్థలాలకు చేరుకోలేకపోయారని , సరిహద్దు వరకు వచ్చి ఆగిపోయారని , అక్కడి పరిస్థితులను గమనించి  తాత్కాలికంగా “వన్ నేషన్ వన్ రేషన్ కార్డు” ను అమలు చేయాల్సిందిగా సూచించింది . ఇలా చేయడంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు ( ఈడబ్ల్యూఎస్ ) సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది .

 జూన్ నుంచి ఒకే దేశం  ఒకే రేషన్‌కార్డు విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది . జస్టిస్ ఎస్వీ రమణ , జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ , జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది .

 ‘ Govt to issue nation one ration card ‘ అమలు చేయడం సాధ్యమా ? కాదా ? అన్న అంశం గురించి ఆలోచించాలని సూచించింది . ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని సుప్రీం కోర్టు తెలిపింది .

 సుప్రీం కోర్టులో పిటిషన్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా . . వలస కార్మికులను ఆదుకునేందుకు తీసుకురావాలని భావిస్తున్న ఈ పథకాన్ని వెంటనే అమలు చేసేలా చూడాలని కోరుతూ . . న్యాయవాది రీపక్ కన్సల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఇలాంటి పరిస్థితుల్లో అమలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని పిటిషన్లో ప్రస్తావించారు .

 వలస కార్మికుడు / రేషన్‌ లబ్దిదారుడు / పౌరుడు వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటే సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం ఉంటుందని కన్సల్ అభిప్రాయపడ్డారు . లాక్ డౌన్ కారణంగా చాలా మంది సొంత రాష్ట్రాల్లో లేరని వివరించారు . ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నా  పనరావాసకేంద్రంలో ఉన్నా . . ఆకలితో బాధపడకుండా ఉండేందుకు స్థానిక గుర్తింపు కార్డు కోరుకుంటున్నారని తెలిపారు . రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ తమ ఓటర్లు , పౌరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని , వలస కార్మికులకు మాత్రం  సబ్సిడీపై ఆహార ధాన్యాలు , భోజనం , షెల్టర్ , వైద్య సదుపాయాలు ఇవ్వడం లేదని తెలిపారు .

 దీనికి స్థానికంగా రేషన్ కార్డు , నివాస ధ్రువీకరణ పత్రం , ఓటర్ ఐడీ కారు లేకపోవడమే కారణమని వివరించారు . ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జూన్ , 2020 లో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం తీసుకొస్తామని గతంలో కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు .

Related Articles

Back to top button