AP లో కొత్తగా 56 కరోనా కేసులు, total coronavirus cases in AP

total coronavirus cases in AP గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా ( కోవిడ్ – 19 ) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 813కు చేరింది . వీరిలో చికిత్స అనంతరం 120 మంది డిశ్చార్జ్ కాగా , మొత్తంగా 24 మంది మరణించారు . ఇక కరోనా బారిన పడి ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు .

 జిల్లాల వారీ వివరాల ప్రకారం గత 24 గంటల్లో చిత్తూరులో 6 , గుంటూరులో 19 , కడపలో 5 , క్రిష్ణాలో 3 , కర్నూలులో 19 , ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాటి కేసులకు సంబంధించిన మీడియా బులెటినను విడుదల చేసింది .

 రాష్ట్రంలో కొత్తగా డిశ్చార్ అయిన వారి వివరాలు ( total coronavirus cases in AP మొత్తంగా 24 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . గుంటూరు – 8 , అనంతపూర్ – 5 , కడప – 4 , నెల్లూరు – 4 , కృష్ణ – 2 , విశాఖపట్నం – 1 , కొత్తగా నమోదైన మరణాలు – 2 ( గుంటూరు జిల్లాలో ) , కోవిడ్ పరీక్షల వివరాలు , రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5757 నమూనాలు పరీక్షించగా 56 మందికి పాజిటివ్ గా తేలింది .

కర్నూలు , గుంటూరు జిల్లాల్లో కరోనా ఉదృతి కొనసాగుతోంది . సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు  24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 39 కేసులు నమోదుకాగా ఇందులో గుంటూరులో 13 , కర్నూలులో 10 కేసులున్నాయి .

 మొత్తంగా రాషంలో 761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించింది . సోమ , మంగళవారాల్లోనే 33 కేసులు నమోదయ్యాయి . సోమవారం 20 , మంగళవారం 13 కేసులు వచ్చాయి . దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది . నరసరావుపేటలోనే 20 కేసులు నమోదు కావడంతో అక్కడ వ్యాధినివారణపై ప్రత్యేకశ్రద్ధ పెట్టింది .

 ఇంకా 1400కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది . వాటిలో ఇంకెన్ని వస్తాయోనని యంత్రాంగం ఆందోళన చెందుతోంది .

కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది . ప్రతి 10 లక్షల జనాభాకు 715 పరీక్షల చొప్పున చేస్తున్నారు . తొలిస్థానంలో ఉన్న రాజస్థాన్లో 830 పరీక్షలు నిర్వహిస్తున్నారు . 692తో తమిళనాడు , 626తో మహారాష్ట్ర మూడు , నాలుగు స్థానాల్లో ఉన్నాయి . ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి .

Related Articles

Back to top button