తెలంగాణలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు, Coronavirus cases in Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్యా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 983 Coronavirus cases in Telangana శుక్రవారంనాడు కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . 29 మంది డిశ్చార్జ్ అయ్యారు .
ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 983కి చేరింది . ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 300 వరకు చేరింది . కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 25కి చేరింది . 663 మంది వివిధ ఆసువత్రులలో చికిత్స పొందుతున్నారు . ఇంకా కరోనా పరీక్షల ఫలితాలు కొన్ని రావాల్సి ఉంది . కొన్ని రోజులుగా అత్యధికంగా జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి .
983 Coronavirus cases in Telangana , సూర్యపేటలో , గద్వాల , వికారాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతోంది . అందుకే ఈ మూడు ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి , వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి క్షేత్ర స్థాయి వర్యటన చేసి పరిస్థితులను సమీక్షించిన విషయం తెలిసిందే .
కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్నారు . ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్య మంత్రి కెసిఆర్ ఆశాభావంతో ఉన్నారు . హైదరాబాద్ సహా , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నారు . గాంధీ ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు .
రాష్ట్రంలో కరోనా వైరస్ కనిపిస్తున్నాయని వైద్యాధికారులు సిఎంకు వివరించారు . సిఎం స్పందిస్తూ రాష్ట్రంలో కరోనా సోకిన వారందరిని గుర్తించామని , వారి ద్వారా ఎవరెవరికీ వైరస్ సోకే అవకాశం ఉందో కాంటాక్టు లిస్టు తయారు చేసి పరీక్షలు జరిపామని , దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామన్నారు . అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యహరించామన్నారు .
కాంటాక్టు వ్యక్తు లందరినీ క్వారంటైన్ చేశామన్నారు . మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమల వుతున్నదన్నారు . ప్రజలు కూడా సహకరిస్తున్నారని మరికొన్ని రోజులు ప్రజలు ఇదే విధంగా సహకరించి లాక్ డౌన్ నిబంధనలను , కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు . ఇప్పటి వరకు 983 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి .