మంచిర్యాల ఏసిపి పై వేటుకు కారణం, Mancherial ACP transferred

Mancherial ACP transferred ఏసిపి పై వేటు పడింది, ముడుపులు తీసుకుని ఒక వ్యక్తికి లాక్ డౌన్లో బయట తిరిగెందుకు అనుమతించేలా వాహన పాస్ ఇచ్చారంటూ మంచిర్యాల అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ( ఏసీపీ ) సీహెచ్ లక్ష్మీనారాయణపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు .

 ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు . వాహన పాస్ కోసం వచ్చిన దరఖాస్తుపై పర్మిటెడ్ అని రాశారని , ఉన్నతాధికారులకు తెలియకుండా ఇలా పాస్ – మంజూరు చేయడం తొందరపాటు చర్య అని , అందువల్ల – సదరు Mancherial ACP transferred ఏసీపీపై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు డీజీపీకి రిపోర్టు పంపించామన్నారు .

 రిపోర్టు ఆధారంగా ఏసీ పీని డీజీపీ కార్యాలయానికి తాత్కాలికంగా అటాచ్ చేశామని వివరించారు . అంతే తప్ప పాస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆయన ఫ్రిజ్ తీసుకోవడం నిజం కాదని చెప్పారు .

 పాస్ పొందిన వ్యక్తి బంధువులు రాచ కొండ సీపీ మహేష్ భగవత్ వద్దకు వెళ్ళి చూపించినట్లు , దాన్ని సీపీ భగవత్ వాట్సప్ ద్వారాడీజీపీకి పంపించారంటూ ‘ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయని , అది కూడా సరికాదని తమ విచారణలో వెల్లడైందని సీపీ పేర్కొన్నారు . కాగా పాస్ విషయంలో తనను ఎవరూ కలవలేదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు .

Related Articles

Back to top button