ఐదు నిమిషల్లో ఎస్బిఐ 5లక్షల లోన్, SBI Bank loan online

 ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI Bank loan online అత్యవసర రుణాలను అందుబాటులోకి తెచ్చింది . కరోనా వైరస్ ఉధృతి , లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభావితమైన ప్రజల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ . 5 లక్షల వరకు రుణాలిస్తామంటూ ముందుకొచ్చింది . కేవలం 45 నిమిషాల్లోనే ఈ రుణాలను పొందగలగడం గమనార్హం .

 మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే . ఇటీవలే దీన్ని ఈ నెల 17 దాకా కేంద్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి విదితమే . లాక్ డౌన్లో వ్యాపార , పారిశ్రామిక కార్యకలాపాలు మూతబడి వివిధ వర్గాలు ఆదాయం కోల్పోగా వారందరికీ ఊరటనిస్తూ ఎస్బీఐ ఈ ఎమర్జన్సీ లోన్ స్కీంను తమ కస్టమర్లకు కల్పించింది .

 ముఖ్యంగా ఈ రుణాలను తీసుకున్నవారికి ఈఎం ఐలు 6 నెలల తర్వాతే మొదలు కానున్నాయి . నగదు కొరతను ఎదుర్కొంటున్నవారికి ఇది నిజంగా ఎంతో ఉపశమనం కలిగించే నిర్ణయమే . ఇక వడ్డీరేటు కూడా ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే చాలా తక్కువ . 10 . 5 శాతం నుంచే ప్రారంభం అవుతుంది .

SBI Bank loan online ::

 ఈ అత్యవసర రుణాల కోసం ఎవరూ బ్యాంకుల దాకా వెళ్లనవసరం లేదు . ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు . ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు . ఎప్పుడైనాసరే ( 24X7 ) మీరు ఆన్ లైన్ లో మీ అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవచ్చు . పూర్తి వివరాల కోసం onlinesbi . com లేదా sbi . co . inలోకి లాగిన్ కావచ్చు . ఇదిలావుంటే ఈ రుణాల కోసం అర్హతను తెలుసుకోవడానికి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయవచ్చు . ఎస్ఎంఎస్ విధానం విషయానికొస్తే . . PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఎస్బీఐ ఖాతా నెంబర్ లోని చివరి 4 అంకెలను టైప్ చేసి 567676కు పంపించాల్సి ఉంటుంది . ఆ తర్వాత మీ అర్హత వివరాలను ఎస్బీఐ మీకు తెలియజేస్తుంది .

SBI Bank loan online apply process ::

 అత్యవసర రుణాన్ని తీసుకునే అర్హత మీకుందన్న సమాచారం ఎస్బీఐ నుంచి వస్తేనే ఈ రుణం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి . ముందుగా YONO SBI యాప్ను మీ స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవాలి . ఆ తర్వాత ‘ ప్రీ – అప్రూవల్ లోన్ ‘ పై క్లిక్ చేయాలి . ఎంత రుణం కావాలి , రుణ వ్యవధి ఎంత అన్నది ఎంచుకోవాలి . అనంతరం మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్ నెంబర్కు ఎస్బీఐ నుంచి ఓటీపీ వస్తుంది . ఈ ఓటీపీని సమర్పించిన వెంటనే మీ సేవింగ్స్ ఖాతాలోకి సదరు రుణ మొత్తం జమ అవుతుంది .

 ఈ మొత్తం ప్రక్రియ 45 నిమిషాల్లోనే ముగుస్తుంది . ఇంకెందుకు ఆలస్యం మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఎస్బీఐ అత్యవసర రుణ పథకాన్ని వినియోగించేసుకోండి . అత్యవసర రుణాలేగాక వేతన జీవుల కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత రుణాలనూ ఎస్బీఐ అందిస్తున్నది . ఇందులో నెలసరి నికర ఆదాయం కంటే 24 రెట్లు అధికంగా రుణ మొత్తాన్ని పొందవచ్చు . రుణ కాలపరిమితి రెండేండ్లు . వడ్డీ రేటు 11 – 14 శాతం వరకు ఉంటుంది . ఉద్యోగ అనుభవం కనీసం ఏడాది ఉండాలి . 21 ఏండ్ల నుంచి 58 ఏండ్ల వయస్సువారే అర్హులు .

One Comment

Back to top button