యూపీలో ఇద్దరు పూజరుల దారుణ హత్య, Hindu priests murdered in UP

యూపీలో Hindu priests murdered in UP ఇద్దరు ఆలయ పూజారులను అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులను  పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

లక్నో లో నీ బులంద్ షహర్ జిల్లాలోని ఓ ఆలయంలో మంగళవారం ఉదయం ఇద్దరు పూజారులు హత్యకు గురయ్యారు . అనుషహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పగువానా గ్రామంలో ఉన్న శివాలయంలో జగదీష్ ( 55 ) , షేర్ సింగ్ ( 45 ) అనే ఇద్దరి పూజారులను నిందితుడు లారీతో కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు . హంతకుడునుతమ అధీనంలోకి తీసుకున్నామని వెల్లడించారు .

 దీంతో ఈ నేరంపై ప్రతిపక్ష నేతలు అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు . ఇటీవల మహారాష్ట్రలోని పాలఘర్ లో ఇద్దరు సాధువులను వారి డ్రైవర్‌ను హతమార్చిన తరువాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందనను కాంగ్రెస్ , శివసేన ప్రస్తావించింది . యూపీ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ మురారి అలియాస్ రాజు అనే యువకుడు రెండు రోజుల క్రితం సాధువులు ఉపయోగించిన పటకారు ను దొంగిలించాడని ఆరోపించారు .

 గంజాయి ప్రభావంతో ఉన్న యువకుడిని ఆలయ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు . సీనియర్ అధికారులు సంఘటన సలానికి చేరుకుని ఆ వ్యక్తిని ప్రశ్నించగా సోమవారం రాత్రి భాంగ్ తీసుకున్న తరువాత ఆలయానికి వెళ్లి అక్కడ పడుకున్న సాధువులను Hindu priests murdered in UP లాఠీతో కొట్టి చంపినట్టు తెలిపాడు . మత్తులో ఉన్న ఆ యువకుడు తను దేవుడి కోరిక మేరకు అలా చేశానని తనకు పుజారులతో ఎలాంటి గొడవలేదని తెలిపాడు .

 నిందితుడు ఇంకా మాదకద్రవ్యాల ప్రభావంతో ఉన్నందున యువకు డిని తరువాత విచారించనున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు . నేరంజరిగిన ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో నగ్నంగా తిరుగుతున్న యువకుడిని గుర్తించి నగ్రామస్తులు అతడిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు . ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు . అధికారులను వివరణాత్మక నివేదిక అందజేయాలని ఆదేశించారు .

Related Articles

Back to top button