ఇండియాలో కరోనా విజృంభణ, Corona rapidly increasing in India

 ఇండియా లో కరోనా డెత్ లు 800 దాటాయి . ఇప్పటి వరకు 825 మంది మృతి చెందారు Corona rapidly increasing in India శనివారం 1 ,819 కొత్త కేసులు నమోదు కాగా , 44 మంది మరణించారు . 443 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు .

 Corona rapidly increasing in India మొత్తం కేసుల సంఖ్య 26 , 267కి చేరుకుంది . ప్రస్తుతం 19 , 503 యాక్టివ్ కేసులుండగా , ఇప్పటివరకు 5 . 939 మంది డిశ్చార్జి అయ్యారు . మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 811 కేసులు , గుజరాత్ లో 256 కేసులు నమోదయ్యాయి . దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 7 , 628 కేసులు నమోదు కాగా , 323 మంది మరణించారు .

 గుజరాత్ లో కేసులు 3 వేలు , ఢిల్లీలో 2 , 500 దాటాయి . రాజస్థాన్ లో 2వేలు దాటగా , మధ్యప్రదేశ్ , తమిళనాడు , యూపీలో 2వేలకు చేరువలో ఉన్నాయి . దీంతో ముంబై , పుణె నగరాల్లో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉంది . ఈ రెండు సిటీల్లో నూ జూన్ వరకూ లాక్ డౌన్ పొడిగించే సూచనలు ఉన్నాయని ఓ ఆఫీసర్ చెప్పారు .

 ప్రస్తుతానికి ముంబై , పుణె సిటీల్లో లాక్ డౌన్ ఎత్తేసే ప్రశ్నే లేదు . కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ ను మరింత కఠినం చేయాల్సిన అవసరం ఉంది. ముంబైలోని మురికివాడ ధారావిలో కరోనా కేసులు తగ్గుతున్నాయి . ఇక్కడ గురువారం 25 కేసులునమోదవ్వగా , శుక్రవారం 5 కేసులే నమోదయ్యాయి .

 కర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ అయింది బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లో ప్లాస్మాథెరపీ ట్రయల్ మొదలైంది . ఐసీయూలో , వెంటిలేటర్ పైనున్న పేషెంట్లకు ఈ విధానంలో ట్రీట్ మెంట్ ఇవ్వనున్నారు .

ఆరోగ్యసేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటేనే జనాలను ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేలా చూడాలని అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ( ఎల్టీ ) అనిల్ బైజన్ సూచించారు . కరోనాపై రివ్యూ మీటింగ్ సందర్భంగా ఆయన ఈ సిఫారసు చేశారు .

 దీనిపై కేజీవాల్ సర్కారు సలహా ఇవ్వాలని డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుర్జీత్ కుమార్ సింగ్ ను ఎల్టీ ఆదేశించారు . మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో యూపీ ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . జూన్ 30 వరకూ పబ్లిక్ మీటింగ్స్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది .

Related Articles

Back to top button