తెలంగాణలో కరోనా ఉధృతి, hike in COVID19 cases in TS
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తుంది . చాపకింది నీరుల్లా విస్తరిస్తున్న మహమ్మారి, hike in COVID19 cases in TS కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కరోనా విశ్వరూపం దాల్చుతుంది . కోరలు చాస్తున్న వైరస్ భూతానికి ప్రజలు వణికిపోతున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదు తగ్గినప్పటికి రాజధానిలో మాత్రం ఆందోళనకర స్థాయిలో విరుచుకపడుతుంది .
గత ఐదు రోజుల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది . రోజుకు సగటున 30కిపైగా పాజిటివ్ కేసులు నమోదైతున్నాయి . సోమవారం ఒక రోజే ఎప్పుడు లేని విధంగా 79 కేసులు నమోదు కావడంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు . ఇప్పటివరకు రాష్ట్రంలో 1275 మందికి పాజిటివ్ రాగా , వారిలో 789 మంది మహానగరం ప్రజలే . మొత్తం కేసులో 80 శాతం కేసులు హైదరాబాద్ నుంచి నమోదైతున్నాయి . మార్చి 2 నగరంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు సికింద్రాబాద్ మహేంద్రహాలకు చెందిన సాఫ్ట్వేర్ యువకుడి సోకింది . అప్పటి నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ గడిచిన నెలల్లో మరింత వేగం పెరిగింది . ఏప్రిల్ 21 నుంచి మే 10వరకు రాష్ట్ర వ్యాప్తంగా 392 కేసులు నమోదైతే అందులో 312 గ్రేటర్ నగరానికి చెందినవే . వరుసగా మూడు రోజులుగా కేసులు చూస్తే శనివారం 30 , ఆదివారం 26 , సోమవారం ఏకంగా 79 కేసులు నమోదయ్యాయి దీన్ని బట్టి నగరంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైతుంది .
hike in COVID19 cases in TS ::
సోమవారం బయటపడిన కేసులో మూడోవంతు జియాగూడలో నమోదయ్యాయి . దిల్షుక్ నగర్ పరిధిలోని ఓ అపార్టుమెంట్లో 9మంది పాజిటివ్ గా తేలారు . జియాగూడలో ఇప్పటివరకు 68 కేసులు కాగా , సోమవారం ఒక రోజే 26 కేసులు వచ్చాయి . దీంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు . మలక్ పేటలో పనిచేస్తున్న మహిళకు , సికింద్రాబాద్లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న ఆమె కుమార్తెకు వ్యాధి సోకింది . వెంటనే సదరు సెంటరు అధికారులు మూసివేసి ఉద్యోగులను క్వారంటైను చేశారు . మూసాపేట , యూసుగూడ , చాదర్ఘాట్ , మల్కపేట , ముషీరాబాద్ ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదైతున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు .
వనస్థలిపురంలో ఒక వృద్ధురాలుకు సోకిన వైరస్ రెండు వ్యవధిలో కుటుంబంలో 19మంది లక్షణాలు బయటపడ్డాయి . వారం రోజుల్లో హయతనగర్ , ఎల్బీనగర్ జోన్ పరిధిలో 68 కేసులు పాజిటివ్ గా వచ్చాయి . ఇప్పటివరకు అమలు చేసిన విధానాలతో ఆశించిన విధంగా కరోనా కట్టడికి సహాకరించలేదని , మరికొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేసి మరో కంటైన్మెంట్లు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు .
ఛత్రినాక లక్ష్మణినగర్లో 69 ఇళ్లు క్యారంటైన్ చేశారు . రెడ్ జోన్ల పరిధిలోని కాలనీలు , బస్తీలోని ప్రజలు బయటకు రాకుండా పకడ్బందీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవడం , వైద్యశాఖ అధికారులు కరోనా సోకిన వ్యక్తి నివసించే చుట్టుపక్కల 200 మీటర్లవరకు ఉండే వారిని క్వారంటైన్ చేయడం , లక్షణాలు కనిపిస్తే గాంధీ తరలించడం వంటి చేయనున్నట్లు చెబుతున్నారు . నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చే వ్యక్తులను ఇళ్లకే పరిమితం చేసి రేషన్ , కూరగాయలు నేరుగా ఇంటికే సరఫరా చేసేందుకు సిబ్బంది ఏర్పాటు , అవసరంలేకున్న రోడ్లపై షీకారు చేసే వారి వాహనాలు సీజ్ చేసి జరిమానాలు విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
2 Comments