Trending

పదవ తరగతి పరీక్షలు ఈ నెలాఖరులో? SSC examination in Telangana

తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే అయితే లాక్ డౌన్ కారణంగా SSC examination in Telangana ఇంటర్ డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు, అంటే కాకుండా పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై హైకోర్టు లో కేసు నమోదు అయ్యింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలాఖరులో టెన్ పరీక్షలు నిర్వహించే అలోచన చేస్తుంది.

 హైకోర్టు అనుమతిస్తే పది రోజుల్లో పరీక్షలు ప్రారంభిస్తామని హైకోర్టుకు  ప్రభుత్వం  అప్పీల్ దాఖలు చేయడం జరిగింది. నేడు లేదా సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది, పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వాయిదా పడిన పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల చివరిలో జరిపేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది . పరీక్షల నిర్వహణపై గురువారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన ప్రభుత్వం అనుమతినిస్తే పది రోజుల వ్యవధిలో పరీక్షలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్లు తెలిసింది .

SSC examination in Telangana ::

 మే నెలలోనే పరీక్షలను నిర్వహిస్తామని ఇటీవల తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు . మార్చి మూడవ వారంలో మొదలైన పదవ తరగతి పరీక్షలు కరోనా , లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే . మూడు పరీక్షలు జరగ్గా , మరో ఎనిమిది పరీక్షలు జరగాల్సివుంది . కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రంలో విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించి వారికి స్థలాలను కేటాయిస్తామని అఫిడవి లో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం .

 రాష్ట్రంలో ఐదున్నర లక్షల మంది ఎస్ఎస్సి పరీక్షలకు దరఖాస్తు చేశారని , గతంలో వీరికి రాష్ట్ర వ్యాప్తంగా 2500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్ల తెలిపింది . కరోనా నేపథ్యంలో వైరస్ సోకుతున్న క్రమంలో పరీక్షా కేంద్రంలో సామాజిక దూరాన్ని పాటించేలా ఒక్కో తరగతి గదిలో 12 మందికి మించి విద్యార్థులను కేటాయిస్తామని , ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని హైకోర్టుకు తెలిపింది .

కరోనా వైరస్ కేసుల్లో త్వరలో చైనాను దాటనున్న భారత్…

విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు త్వరితగతిన పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది . ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బి . ఎస్ . ప్రసాద్ అప్పీల్ దాఖలు చేయగా శుక్రవారం లేదా సోమవారం దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది . పాత హాల్ టిక్కెట్ల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది . అయితే పరీక్షల సంఖ్య కుదిస్తరా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.

Related Articles

Back to top button