మంచిర్యాల కు పొంచి ఉన్న ప్రమాదం, issues with migrant workers

మంచిర్యాల  జిల్లాలోకి వలస కార్మికుల ( issues with migrant workers ) రాకతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు, పక్కన ఉన్న మహారాష్ట్ర  నుండి వలస కార్మికుల రాక ఎక్కువగా ఉండటం , వారికి కరోనా లక్షణాలు ఉండటంతో పాటు పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

లాక్ డౌన్ విధించిన మొదటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో ఒక కేసు నమోదు కాగా అది కూడా మృతి చెందిన అనంతరం కరోనా పాజిటీవ్ గా నమోదు కావడంతో జిల్లా ప్రజలు ఇప్పటివరకు ఆత్మసైర్యంతోనే ఉన్నారు . వలస కార్మికుల రాకతో వాటి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . సరిహద్దు ప్రాంతాల్లోనే వారికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలే తప్ప నేరుగా గ్రామాలకు తరలించకుండా అధికారులు చూడాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు .

issues with migrant workers ::

 సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం , అక్కడి నుండే వలస కార్మికులు అధిక సంఖ్యలో రావడంతో పెద్దఎత్తున జిల్లాకు ప్రమాదం పొంచి ఉంది . ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్ సోగా మరికొంత మంది వలన కార్మికుల్లో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అనధికారికంగా తెలుస్తోంది . ఇప్పటివరకు జిల్లాలో 80 మంది నుండి రక్త నమూనాలను సేకరించగా అందులో 77 మందికి నెగిటీవ్ రిపోర్టులు రాగా ఒక మహిళ మృతి చెందిన అనంతరం పాజిటీవ్ గా నిర్ధారణ అయింది . ఆమెతో పాటు మరో ముగ్గురు వలన కార్మికులకు పాజిటీవ్ నిర్ధారణ అయింది .

 మరో 8 మందికి సంబంధించిన రక్త నమూనాలు నిర్ధారణ కావాల్సి ఉండగా అందులో 7గురికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని , వారికి కరోనా పాజిటీవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం . దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు . సరిహద్దు ప్రాంతాల్లో చెకపోస్టులలో ధర్మల్ స్కానింగ్ నిర్వహిస్తున్నప్పటికీ వారికి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని , ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు .

Related Articles

Back to top button