భారత్ లో వేగంగా విస్తరిస్తున్న కరోనా, COVID19 positive cases in India
COVID19 positive cases in India గురువారం సాయంత్రానికి మొత్తం 33 , 610 కేసులు నమోదైనట్లు హోం మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి . గత 24 గంటలలో 1 , 718 కొత్త కేసులు నమోదు కాగా , 67 మంది మరణించారు . దేశవ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1 , 075కు చేరుకోగా , 8 , 373 మంది కోలుకున్నారు .
దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య 25 . 13 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరి లవ్ అగర్వాల్ గురువారం మీడియాకు తెలిపారు . దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య 15 రోజుల క్రితం నమో దైన 13 శాతంతో పోలిస్తే గురువారం నాటికి మెరుగు పడిందన్నారు . దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడానికి ముందు 3 . 4 రోజులకు రెట్టింపయ్యే కేసులు , ఇప్పుడు 11 రోజులకు రెట్టింపవుతున్నాయని , COVID19 positive cases in India మొత్తం ఇప్పటి వరకు 8 , 373 మంది కోలుకున్నారని చెప్పారు .
ప్రస్తుతం భారత్ లో కరోనా మృతుల సంఖ్య 3 . 2 శాతం ఉందని , ఇందులో 65 శాతం పురుషులు , 35 శాతం మహిళలు మరణించారని తెలిపారు . ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ , జమ్ము కాశ్మీర్ , ఒడిషా , రాజస్థాన్ , తమిళ నాడు , పంజాలో 11 – 20 రోజుల మధ్య కాలంలో కేసులు రెట్టింపవుతు న్నాయన్నారు . కర్ణాటక , లడక్ , హర్యానా , ఉత్తరా ఖండ్ , కేరళలో ప్రతి 20 – 40 రోజుల మధ్య కేసులు రెట్టింప వుతున్నాయని చెప్పారు .
గత నెల 25 నుంచి కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్ డౌన్లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్నారు . పాజిటివ్ కేసులు , మరణాల రేటులో పెరుగుదల స్థిరంగా తగ్గుతున్నట్లు తమ విశ్లేషణలో వెల్లడైందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితబ్ కాంత్ తెలిపారు .
రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు::
కర్ణాటకలో గురువారం కొత్తగా 22 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి . బుధవారం సాయంత్రం తుమకూరులో 74 ఏళ్ల వ్యక్తి మరణంతో మృతుల సంఖ్య 21కు చేరుకుంది . బెళగావి జిల్లాలో 14 కొత్తకేసులు వచ్చాయి . రాష్ట్రంలో బాధితుల సంఖ్య 565కు చేరుకుంది .
కేరళ సీఎం విజయన్ కేరళలో గురువారం రెండు కేసులే నమోదయ్యాయని , 14 మంది కోలుకున్నారని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు . కొత్తగా నమోదైన ఇద్దరిలో ఒకరు మల్లాపురం , మరొకరు కసర్గోడ్ జిల్లాలకు చెందిన వారు . కోలుకున్న వారిలో పాలక్కడ్ జిల్లాకు చెందిన వారు 4 , కొల్లామ్ కు చెందిన వారు ముగ్గురు , కన్నూర్కు చెందిన వారు 2 , కసర్కోడకు చెందిన ఇద్దరు , పతనమ్ తిట్ట , కోజికోడ్ , మలప్పురమకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు . ఇప్పటి వరకు 493 కేసులు నిర్ధారణ కాగా , 11 మంది చికిత్స పొందుతున్నారు . పరిశీలనలో ఉన్న వారి సంఖ్య 20 , 711కు తగ్గింది . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ ఊహించని ప్రదేశాలలో కరోనా కనిపిస్తోందన్నారు . ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన రవాణా వాహనాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయన్నారు . ప్రస్తుతమున్న ఆంక్షలను సడలించేది లేదన్నారు .