AP లో వేగంగా వైరస్ వ్యాప్తి, CoVID19 positive cases in Andhra Pradesh
CoVID19 positive cases in Andhra Pradesh కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది . రాష్ట్రంలో ప్రతి 36 గంటలకు 100కు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుండటంతో సర్వాత్ర ఆందోళన వ్యక్తమవుతోంది . తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 71 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి . గడిచిన 24 గంటల్లో మొత్తం 6 , 497 నమూనాలు సేకరించి , నిర్దారించగా వాటిలో 71 మందికి పాజిటివ్ వచ్చింది . దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1 , 403కు చేరుకుంది .
కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలులో అత్యధికంగా 48 కేసులు రిపోర్టయ్యాయి . దీంతో రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు ఉంది . ఇక్కడ ఇప్పటి వరకు 886 కేసులు నమోదు కాగా , ప్రస్తుతం 334 యాక్టివ్ కేసులు ఉన్నాయి . తర్వాత కృష్ణాలో 10 , గుంటూరులో 4 , నెల్లూరులో 2 , అనంతపురంలో 3 . చిత్తూరులో 3 , తూర్పుగోదావరిలో 2 , కడపలో 4 కేసుల చొప్పున నమోద య్యాయి .
అలాగే ఇప్పటి వరకు మొత్తం 321 మంది కరోనా బాధితులు కోలుకుని , హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు . ఇక రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు . ఇప్పటి వరకు 31 మంది కరోనా మరణించారు . CoVID19 positive cases in Andhra Pradesh 1051 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి . ఒకవైపు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతోనే కేసుల సంఖ్య భారీగా బయటపడుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ , క్షేత్రస్థాయిలో మాత్రం అటు ప్రజల్లో , ఇటు అధికార యంత్రాంగంలో అంతులేని ఆవేదన వ్యక్తమవుతోంది .
గడిచిన వారం రోజులుగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి రోజూ 70నుంచి 80కు ఏమాత్రం తగ్గకుండా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి . ఈ క్రమంలో రాష్ట్రం దేశంలోని 32 రాష్ట్రాలు , కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలతో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది . దేశంలో 9 , 915 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానలో ఉండగా , 4 , 082 కేసులతో గుజరాత్ తర్వాత స్థానంలో ఉంది . ఇదే క్రమంలోఢిల్లీలో 3 , 439 పాజిటివ్ కేసులు , మధ్యప్రదేశ్ లో 2 , 660 కేసులు , రాజస్థాన్లో 2 , 438 కేసులు , ఉత్తరప్రదేశ్ లో 2 , 203 కేసులు , తమిళనాడులో 2 , 162 కేసులు నమోదయ్యాయి .
ఇక ఆంధ్రప్రదేశ్ 1 , 403 కేసులతో వాటి తర్వాత స్థానంలో ఉంది . మన పక్క రాష్ట్రం తెలంగాణ మనకంటే దాదాపు 400ల కేసులతో తక్కవుగా ఉంది . ప్రస్తుతం అక్కడ 1 , 012 కరోనా కేసులు ఉన్నాయి . 94 , 558 నిర్ధారణ పరీక్షలు రాష్ట్రంలో ఇప్పటి వరకు 94 , 558 కరోనా నిర్ధారణ పరీక్షలు గావించారు . గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 5వేల నుంచి 6500ల పైబడి కరోనా పరీక్షలు చేస్తుండటంతో , నిర్ధారణ పరీక్షలు బాగా పెరిగాయి .