భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర, LPG gas cylinders price reduced
లాక్ డౌన్ వేళ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న జనాలకు కాస్తంత ఉపశమనం కలిగిస్తూ LPG gas cylinders price reduced ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చిన్నపాటి తీపికబురు చెప్పాయి . సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ . 162 . 50 మేర తగ్గించాయి .
అంతర్జాతీయంగా కరోనా సంక్షోభం , ఇంధన డిమాండ్ భారీగా పతనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు వివరించారు . ఒక్కో సిలిండ ర్పై రూ . 162 . 50 పైగా తగ్గింపు అంటే భారీ తగ్గింపుగా పేర్కొనాలి . మరోవైపు కమర్షియల్ వినియోగం కోసం వాడే 19 కేజీల వంటగ్యాస్ దర ర . 1 , 285 నుంచి రూ . 1 , 029కి తగ్గింది .
ఈ భారీ తగ్గింపుతో న్యూఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ . 581 . 50కి ( 14 . 2 కేజీ లు ) దిగొచ్చింది . గురువారం రూ . 744గా ఉండడం తో భారీగా తగ్గిందని ప్రభుత్వం రంగ ఆయిల్ కంపెనీల నోటిఫికేషన్ పేర్కొంది . తాజా తగ్గింపుతో ముంబై లో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర రూ . 714 . 50 నుంచి రూ . 579కి దిగొ చ్చింది .
అయితే తాజా తగ్గింపుతో వంటగ్యాస్ ధరలను వరుసగా మూడో నెల LPG gas cylinders price reduced తగ్గించినట్టయింది . మార్చిలో 58 , ఏప్రిల్ లో 61 . 50 మేర తగ్గించి న విషయం తెలిసిందే . మూడుసార్లు తగ్గింపుతో సబ్బిడీయేతర వంటగ్యాస్ ధరపై మొత్తం రూ . 277 మేర తగ్గించినట్టయింది . ఫిబ్రవరిలో సలిండర్ ఏకంగా రూ . 144 . 50 మేర ధర పెంచడం తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది .
వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి . దీంతో హైదరాబాద్ మహానగరంలో 14 . 2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ . 207 తగ్గి రూ . 589 . 50కు లభించనుంది . వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర సైతం రూ . 336 తగ్గి రూ . 988నుంచి ప్రారంభమవుతుంది . చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం వల్లమెట్రోనగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి .
ఇదిలావుండగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగి వచ్చింది . అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ ఇంధన ధర , ఫారెన్ ఎక్స్చేంజీ రేట్ల ఆధారంగా ప్రతి నెల మొదటి రోజున ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి . మార్కెట్ ధర ప్రకారమే దేశవ్యాప్తంగా వంటగ్యాస్ లభ్యమవుతోంది . అయితే అర్హత కలిగిన కొనుగోలుదార్ల ఖాతాల్లోకి సబ్సిడీ నేరుగా జమ అవుతోంది . అర్హత కలిగిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై పొందవచ్చు .
One Comment