మహారాష్ట్రలో కరోనా విలయతాండవం, 5649 coronavirus cases in Maharashtra
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది మొత్తం 5649 coronavirus cases in Maharashtra పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్యశాఖ తెలిపింది . దీంతో దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానానికి చేరుకుంది .
గత 24 గంటల్లో 431 కొత్త coronavirus cases in Maharashtra నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు . గురువారం ఉదయం 10గంటలకు అందిన గణాంకాల ప్రకారం కోవిడ్ 19 కారణంగా 18కొత్త మరణాలు నమోదయ్యాయి . మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 269కు చేరింది . మొత్తంమీద దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 , 398కు పెరిగాయి . 681 మరణాలు సంభవించాయి .
కాగా లాక్ డౌన్ ముగిసిన తరువాత మహారాష్ట్రలో చిక్కుకు పోయిన వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ముంబై , పుణే నుంచి ప్రత్యేక రైలు సర్వీసులును నడపాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ కోరారు .
లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత రైలు సర్వీసులు తిరిగి ప్రారంభించినపుడు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు పెద్దసంఖ్యలో ముంబై , పుణెకు చేరుకుంటారని రైల్వే మంత్రి గోయలకు రాసిన లేఖలో పవార్ తెలిపారు . ఇది శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని వివరించారు . దీన్ని నివారించడానికి రైల్వే మంత్రిత్వశాక ప్రత్యేక రైళ్లు నడపాలని ఆయన డిమాండ్ చేశారు .
యూపీ , బీహార్ , ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు తమ ప్రభుత్వం వసతి , ఆహారాన్ని ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర ఆర్థికమంత్రి తెలిపారు .
One Comment