లాక్ డౌన్లో పాస్ ఆన్లైన్ అప్లై విధానం, QR code passes in lockdown
లాక్ డౌన్లో రోడ్లపై అనుమతికీ QR code passes in lockdown క్యూఆర్ కోడ్ పాస్ ను పుణె పోలీసులు తీసుకువచ్చారు, ఇపుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు , డిజిపి , కమిషనర్లు దీనిపై చర్చించారు . పుణె కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ వెంకటేశంతో మాట్లాడడంతో పాటు ఈ టెక్నాలజీని అందిస్తున్న హైదరాబాదు చెందిన సైబేజ్ సంస్థతో చర్చించారు .
క్యూఆర్ కోడ్ రూపకల్పన , స్కానింగ్ , సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించి తెలంగాణ రాజధాని మహానగరంలో అమలుకు రెడీ అయిపోయారు . అనుమతి కావాలంటే తెలంగాణలో అత్యవసరపనుల కోసం అనుమతి QR code passes in lockdown కావాల్సిన వారు ముందుగా ఆన్లైన్ లో అప్లై చేయాలి.
లాక్ డౌన్ లో పాస్ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్సైట్ www.hyderabadpolice.gov.in ను ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ , చిరునామాను , ఎందుకు అనుమతి అడుగుతున్నారు ? ఎక్కడికి వెళ్ళాలి ? ఏ మార్గంలో వెళతారు ? ఎవరెవరు వెళతారు ఇలాంటి వివరాలు ఫొటో , ఆధార్తో సహా నమోదుచేయాలి.
ఈ దరఖాస్తుని పోలీసు స్పెషల్ బ్రాంచి పోలీసులు పరిశీలిస్తారు . సక్రమమని భావిస్తే పది నిమిషాల్లోనే దరఖాస్తుదారుడి ఫోను ఈ – పాస్ వెళ్తుంది . ఈ పత్రాన్ని కలర్ ప్రింట్ తీసుకోవాలి . ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది . ఈ క్యూఆర్ – కోడ్లోనే సంబంధిత దరఖాస్తుదారుడు ఏ మార్గంలో ప్రయాణం – చేసేది కూడా పొందుపరిచి ఉంటుంది .
మార్గమధ్యలో పోలీసులు ఎక్కడ ఆపి పరిశీలించినా ఈ క్యూఆర్ కోడ్ పాస్ వారికి చూపించాలి . తమ వద్దనున్న స్కానర్ తో ట్రాఫిక్ పోలీసులు దీనిని స్కాన్ చేస్తారు . అందులో పేర్కొన్న వ్యక్తులతో పాటు వాహనానికి నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణిస్తున్నట్లు దృవీకరించుకుంటే ముందుకెళ్ళేందుకు అనుమతినిస్తారు . లేని పక్షంలో వాహనాన్ని సీజ్ చేస్తారు .
నిర్దేశించిన దారిలో కాకుండా వేరే దారి లో వెళ్తే ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుంటారు . అప్పటికపుడు ఇచ్చిన అనుమతులు రద్దుచేస్తారు . ఈ నేపథ్యంలో అత్యవసరం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు .