తెలంగాణలో మరో 49 కొత్త కరోనా కేసులు, total coronavirus cases in Telangana
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల నమోదు కొనసాగుతోంది . బుధవారం కొత్తగా 49 కేసులు నమోదు కాగా total coronavirus cases in Telangana 453 కు చేరుకుంది . ఈ వైరస్ ఒక్కోచోట ఒక్కోవిదంగా జనాన్ని బాధితులను చేస్తోంది .
కొత్త కేసుల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 కేసులు , హైదరాబాద్ జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి . కేసుల పరంగా హైదరాబాద్ 161 కేసులతో టాప్ లో ఉంది .
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కార్యాలయం పరిధిలోని చాటుపల్లి గ్రామానికి విఆర్గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్ నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చాడు . అక్కడి నుంచి తెచ్చిన స్వీట్లను పంచిపెట్టాడు . ఈ స్వీట్లను ఎమ్మార్వో సహా అందరికి తినిపంచాడు . తీరా అతనికి కరోనా పరీక్షలో వైరస్ సోకిందని తేలడంతో ఎమ్మార్వో సహా స్వీటు తిన్న అందరూ క్వారంటైన్ కు వెళ్లాల్సిన వచ్చింది.
ఖమ్మంలో రెండో కేసు ఖమ్మంలోని ఖిల్లా ప్రాంతానికి 65 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు . బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు.
కరోనా వైరస్ కేసులు జిల్లాల వారీగా::
ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం 453 total coronavirus cases in Telangana అదిలాబాద్ లో ఇప్పటికే 11కేసులుండగా కొత్త కేసు నమోదు కాలేదు . హైదరాబాద్ లో ఇప్పటికే 150 కేసులు నమోదు కాగా తాజాగా మరో 11 కేసులు నమోదు కావటంతో కేసుల సంఖ్య 161కి చేరింది . రాష్ట్రంలో అత్య ధికంగా కేసులు ఇక్కడే నమోదు కావటం గమనార్హం . జగిత్యాలలో 2 కేసులుండగా కొత్తగా మరో కేసు నమోదైంది.
జనగాంలో ఇప్పటికే 2 కేసులున్నాయి కొత్తకేసు నమోదు కాలేదు . జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 కేసులుండగా కొత్తగా మరో కేసు నమోదవటంతో కేసుల సంఖ్య 3కు చేరింది . కామారెడ్డిలో 10 కేసులుండగా 2 కొత్తకేసులు నమోదయ్యాయి . దాంతో జిల్లాలో కరోనా కేసులు 12 కు చేరాయి.
మహబూబ్ నగర్ జిల్లాలో 09 కేసులకు తోడు కొత్తగా మరో కేసు నమోదైన ఆ జిల్లా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకొని 10గా నమోదైంది . మేడ్చల్ లో 15 కేసులకు తోడు మరో 8 కేసులు నమోదవటంతో ఆ జిల్లాలో కేసులు 18కి చేరాయి . నల్గొండలో 13 కేసులుండగా మరో కేసు నమోదవుటంతో 14కు చేరింది .
నిర్మల్లో 4 కేసులకు తోడు కొత్తగా 6 కేసులు నమోదవటంతో 10కి చేరింది . నిజామాబాద్ లో 36 కేసుల కు తోడు మరో 3 కొత్త కేసులునమోదవటంతో కేసుల 39కి చేరాయి . రంగారెడ్డి జిల్లా లో 10 కేసులకు తోడు కొత్తగా 17 కేసులు నమోదవటంతో కేసుల సంఖ్య 27కు చేరిం ది . సూర్యాపేటలో 08 కేసులుండగా కొత్తగా మరోకేసు నమోదవటంతో కేసులు 09 కి చేరాయి . వికారాబాద్ లో ఖమ్మంలో ఒక్కోటి చొప్పన కొత్త కేసులు నమోదయ్యా యి . కరీంనగర్ , మహబూబాబాద్ , మెదక్ కొత్తగా కేసులు నమోదు కాలేదు .
5 Comments