తెలంగాణలో తగ్గుతున్న కరోనా,కొత్తగా 6 కేసులు, total 650 coronavirus cases in TS
తెలంగాణ రాష్ట్రంలో 6 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. total 650 coronavirus cases in TS 650కి చేరిన పాజిటివ్ కేసులు 118 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కి చేరింది . బుధవారం అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . కేవలం ఆరుగురికి మాత్రమే కరోనా సోకినట్లు వైద్య , ఆరోగ్యశాఖ జారీ చేసిన ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా బారినపడి 18మంది మృతి చెందారు . ఇప్పటిదాకా 118 మంది వ్యాధిగ్రస్థులు డిశ్చార్జి కాగా బుధవారం 8మందిని ఆయా ఆసుపత్రుల నుంచి ఇంటికి పంపించారు .
భాగ్యనగరం హైదరాబాద్లో మాత్రం కరోనా విజృంభిస్తూనే ఉంది . ఒక్క హైదరాబాద్లోనే ఇప్పటి దాకా 287 కేసులు నమోదు కాగా , 70మంది డిశ్చార్జి అయ్యారు . వికారాబాద్లో కొత్తగా మూడు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది . ఈ జిల్లాలో ఇప్పటిదాకా 32మందికి కరోనా వైరస్ సోకింది .
total 650 coronavirus cases in TS జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి .
నిజామాబాద్ 36 , రంగారెడ్డి 16 , వికారాబాద్ 35 , వరంగల్ అర్బన్ 21 , జోగులాంబ – గద్వాల 18 , సూర్యాపేట 23 , మేడ్చల్ 2 , నిర్మల్ 17 , కరీంనగర్ 4 , నల్గొండ 12 , ఆదిలాబాద్ 11 , మహబూబ్ నగర్ 10 , కామారెడ్డి 8 , ఖమ్మం 7 , సంగారెడ్డి 6 , మెదక్ 5 , కొత్తగూడెం 2 , భూపాలపల్లికి , ఆసిఫాబాద్ 8 , నాగర్ కర్నూలు 2 , జగిత్యాల 2 , ములుగు 2 , పెద్దపల్లి 2 , మహబూబాబాద్ 1 , సిద్దిపేట 1 , రాజన్న సిరిసిల్ల 1 . జనగామ జిల్లాలో వైరస్ సోకిన ఇద్దరు వ్యాధి నయం కావడంతో వైద్యులు వారిని డిశ్చార్జి చేశారు .
One Comment