రోడ్లపై ఉమ్మితే జైలుకే, TS govt precautions to Stop corona virus

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి నీ అరికట్టడానికి TS govt precautions to Stop corona రహదారులపై ఉమ్మడం , బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల సేవించడం , గుట్కా నమలడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం , నిబంధనల ఉల్లంఘనులపై క్రిమినల్ చర్యల దిశగా నిర్ణయం తీసుకుంది .

 బుధవారం ఈ మేరకు కరోనా వైరస్ కట్టడికి TS govt precautions to Stop corona రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు కీలక మార్గదర్శకాలను సూచించింది . ఇష్టానుసారంగా అపరిశుభ్రతకు కారణమవుతున్న వారిపై కీలక చర్యల దిశగా నిర్ణయం తీసుకుంది .

 వ్యక్తిగత , సామాజిక పారిశుద్ధ్యం , పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చేలా పలు ఆదేశాలతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . రహదారులు , సంస్థలు , కార్యాలయాలు , బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

 ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి  ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత , బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి చేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు . అనారోగ్యకరమైన అలవాట్లు , దురలవాట్లుపై ప్రజలను చైతన్యం చేసి , వీటిని వారు మానుకునేలా చూడాలని ఆదేవించారు . వీటి ద్వారా ఇతరులకు వైరస్ , ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని , ప్రజారోగ్యం , భద్రత దృష్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్ , గుట్కా , ఉమ్మి వేయడం , గుట్కా నమిలి ఉమ్మడం , పొగాకు నమలి ఉమ్మడాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీచేవారు .

 ఈ నిబంధనలను అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు .

Related Articles

Back to top button