ఒకే రోజులో 549 కొత్త కరోనా కేసులు, total 5734 COVID19 cases in India

 దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 549 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాగా , 17 మంది మృత్యువాత పడ్డారు . దీంతో కరోనా కేసుల సంఖ్య total 5734 COVID19 cases in India కు , మృతుల సంఖ్య 166కు పెరిగింది . 473 మంది కరోనావైరస నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

 ప్రస్తుతం దేశానికి అవసరమైన మేర హైడ్రాక్సీక్లోరోక్విన్ అందుబాటులో ఉందని తెలిపారు . 80వేల ఐసొలేషన్ వార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి . 5 వేల రైల్వే కోలను ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేస్తున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు .

 అంతేగాక రైల్వేలో పనిచేసున్న 2500 మంది డాక్టర్లు , 35 వేల మంది పారా మెడికల్ స్టాఫ్ కోవిడ్ – 19 విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు . 586 రైల్వే ఆరోగ్య కేంద్రాలు , 45 ఉప కేంద్ర ఆస్ప త్రులు , 56 డివిజనల్ హాస్పిటల్స్ , 8 ప్రొడక్షన్ యూనిట్ హాస్పిటల్స్ , 16 జోనల్ హాస్పిటల్స్ కోవిడ్ – 19 చికిత్స అందజేస్తున్నాయని లవ్ అగర్వాల్ వివరించారు.

 దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 30 శ్యాంపుల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ( ఐసీఎం ఆర్ ) వెల్లడించింది . ఇందులో 5,784 శ్యాంపుల్స్ పాజి టిగా తేలింది . పాజిటివ్ రేటు 3 – 5శాతం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది.

 పీపీఈలు దేశవ్యాప్తంగా 20 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా , 1.7 కోట్ల పీపీఈలకు ఆర్డర్ ఇచ్చామని , ఇప్పటికే సరఫరా ప్రారంభమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు . 49 వేల వెంటిలేటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

 total 5734 COVID19 cases in India , యు ఏ ఈ లో చిక్కుకున్న భారతీయులను తక్షణమే వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు.

మహారాష్ట్ర లో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధులవేతనాల్లో 30శాతం మేర కోత విధిస్తూ మహా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది . ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు ఏడాది పాటు జీతంలో 30 శాతం కోత పెట్టాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్రపింది .

Related Articles

Back to top button