మీకు దండం పెడతా బయటికి ఎవరు రావద్దు-KCR & మోడీ, 21 Days local down
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నుంచి రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని ముందస్తుగా 21 Days local down నివారణ చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దేశవ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి .
ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ ప్రభావం దేశం పై ఉండొద్దని , ఇందుకుగాను ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు 21 Days local down ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ ప్రకటించారు . ఈ సందర్భంగా కరోనా మహామ్మారి నుంచి తమకు తాముగా , రాషాన్ని , దేశాన్ని కాపాడేందుకు ప్రజలు స్వీయనియంత్రణ చేయాలని కోరారు .
కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌనకు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని , ఇంటి నుంచి బయటికి రావద్దని , అత్యవసరం అయితే తప్ప రోడ్డుపైకి రావద్దని విన్నవించారు .
ఈనెల 22న కేంద్రప్రభుత్వం జనతా కర్వ్యూలో రాష్ట్ర ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ప్రజలకు సీఎం కృతజ్ఞతలు సైతం తెలిపారు . అలాగే ఏప్రిల్ 14వరకు ప్రజలు సహకరించాలని , ప్రజా సహకారంతోనే కరోనా వైరస్ బారిన రాష్ట్రం పడకుండా ఉంటుందని కోరారు .
ప్రజలు సోమవారం ఉదయం నుంచి రోడ్లపైకి బారీ ఎత్తున వచ్చేశారు . స్వంత వాహనాలతో పాటు ఆటోలు కూడా భారీగా రావడం , పెద్ద , చిన్నా , చితక దుకాణాలు తెరవడం , రైతు బజార్లు తెరవడంతో ప్రజలు ఒక్కసారిగా బారులు తీరారు .
దీంతో ముఖ్యంగా హైదరాబాద్లో లాక్ డౌన్ ప్రశ్నార్థంగా మారింది . ఈ విషయాలు టీవీలు , సోషల్ మీడియాలో రావడం చూసి సీఎం కేసీఆర్ ఒక్కసారిగా సీరియర్ అయ్యారు . సీఎస్ సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతస్థాయి సమీక్షించారు .
ప్రజలు రోడ్లపైకి రావడం , దుకా బాలు తెరవడంపై పోలీసు అధికారులు , పోలీసులపై కన్నెర్ర చేయడంతో మధ్యాహ్నం తర్వాత పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను అదుపు చేసేందుకు యత్నించారు .
కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి స్వంత వాహనాలపై వెళ్తున్న ప్రజలను అడ్డుకున్నారు . కరోనా వైరస్ ప్రభావం , అలాగే లాక్ డౌన్ చట్టంపై అవగాహన కల్పించారు.
5 Comments