క్వారంటైన్ నుంచి పారిపోయిన IAS అధికారి, IAS escaped from quarantine
కేరళలో గృహ నిర్బంధంలో ఉన్న ఐఎఎస్ అధికారి అనుపమ్ మిశ్రా IAS escaped from quarantine హోం క్వారంటైన్ నుంచి పరారయ్యారు . విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆయనను కొంతకాలం గృహనిర్బంధలో ఉండాలని ఉన్నతాధికారులు సూచించినా ఆయన పాటించలేదు .
ఉత్తరప్రదేశ్ కు చెందిన మిశ్రా కొల్లం సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు . మిశ్రా నియమ , నిబంధలను ఉల్లంఘించారని తెలియజేస్తూ ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది . దీంతో ఆయనను కేరళ ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది . ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ విలేఖరులకు తెలిపారు . ఈ సందర్భంగా సీఎం విజయన్ మాట్లాడుతూ ఇది సరైన చర్య కాదన్నారు .
హోం క్వారంటైన్లో ఉన్నప్పుడు వైద్యసిబ్బంది సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు . అయితే సబ్ కలెక్టర్ వంటి బాధ్యతాయుతమైన అధికారి IAS escaped from quarantine కేరళ నుంచి పారిపోవడం రాష్ట్రానికి అవమానంగా ఉందని విజయన్ తెలిపారు . తాము ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు విజయన్ తెలిపారు .
యువ ఐఎఎస్ అధికారి మార్చి 19న విదేశాలనుంచి హానీమూన్ ముగించుకుని రావడంతో పరిశీలనలో ఉన్నారని తెలిపారు . అయితే ఆయన ఎవరికీ తెలపకుండా బెంగళూరులోని అతడి సోదరుడి దగ్గరకు వెళ్లారన్నారు . మిశ్రా ఇటీవల విదేశాలనుంచి తిరిగి వచ్చారని కొల్లం కలెక్టర్ అబ్దుల్ నాజర్ తెలిపారు .
మిశ్రా మార్చి 19న మలేషియా , సింగపూర్ పర్యటన నుంచి కేరళకు వచ్చారు . ప్రొటోకాల్ ప్రకారం గృహనిర్బంధంలో ఉండాలని ఆయనకు అధికారులు సూచించారు . ఈ క్రమంలో ఎవరికీ – చెప్పకుండా పరారైన మిశ్రాను కలెక్టర్ నాజర్ మొబైల్ ఫోన్లో సంప్రతించగా బెంగళూరు ఉన్నట్టు సమాచారం ఇచ్చారు.
మిశ్రా మొబైల్ ద్వారా ఆయన ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు అనుపమ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వద్ద ఉన్నట్టు తెలిపారు . కేరళలోని కొల్లంలో ఉన్న తన క్వార్టర్స్ నుంచి ఒంటరిగా ఉంటున్న మిశ్రా వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు . ఒక అధికారి తన పరిధిని విడిచి వెళుతున్నపుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
మిశ్రా రాష్ట్రాన్ని విడిచి వెళ్లేముందు ముందస్తు అనుమతి తీసుకోలేదని కలెక్టర్ నాజర్ తెలిపారు . మిశ్రాపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ – 188 , సెక్షన్ 269 ,సెక్షన్ 271 ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు .