ఇంటింటా సమగ్ర ఆరోగ్య సర్వే, CM announced health survey

 కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం గురించి CM announced health survey మరో దఫా సమగ్ర సర్వే చేపడతామని ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు . రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుందన్నారు . 

సర్వే నివేదిక ఆధారంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆయన వెల్లడించారు . రాషంలో కోడిడ్ 19 పరిస్థితిపై సీఎం వై . ఎస్ . జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో సమీక్షాసమావేశం నిర్వహించారు . లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు .

 ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు , వారితో కాంటాక్ట్ అయినవారిపైన కాకుండా ప్రజలందరిమీద కూడా దూఎష్టిపెట్టాలని అధికార్లకు సూచించారు . కోవిడ్ 19 వ్యాప్తిని నిరోధించాలన్నారు . దీనికోసం మరో దఫా వాలంటీర్లు , ఏఎన్ఎంలు , ఆశా వర్కర్లతో కలిపి సర్వే చేయించాలని ఆదేశించారు .

రాషంలో ప్రతి ఇంటినీ కూడా సర్వే చేయాలని CM announced health survey , సర్వే తర్వాత వివరాలను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని అధికార్లకు ఆయన ఆదేశించారు . కరోనా లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే సత్వరమే వారికి వైద్య సహాయం అందించాలన్నారు . మీరు ఇంట్లో ఉండడం వల్ల వాలంటీర్లు , ఏఎన్ఎంలు , ఆశావర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారు అవుతారని చెప్పారు . 

ఇప్పటివరకూ పాజిటవ్ గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన మరిన్ని చర్యలు చేపడుతుందన్నారు . లక్షణాలు ఉన్నవారు విధిగా హోంఐసోలేషన్ పాటించాలని సీఎం కోరారు .

 ఈ సమావేశంలో ఏపీఎస్ఎంఎస్పీడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి , ఏపీఎంసీ ఛైర్మన్ సాంబశివారెడ్డి , ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ , అదనవు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి , గ్రామ , వార్డు సచివాలయాలు , వాలంటీర్ల వ్యవస్థ స్పెషల్‌ సెక్రటరీ కన్నబాబు పాల్గొన్నారు . 

విదేశాల నుంచి వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందే విదేశాల నుండి వచ్చిన వారందరూ తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండేలా చూడాలని అధికార్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు . కరోనా వైరస్ పై మంగళవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు .

 వీడియో సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఈనెల 31 వరకూ లాక్ డౌన్ ను పటిష్ట వంతంగా అమలు చేయాలని కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు . విదేశాల నుండి వచ్చిన వారందరూ తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండేలా చూడాలని ఆదేశించారు . ఎవరైనా ఎక్కడైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇళ్ళ నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు .

Related Articles

Back to top button