తెలంగాణలో కరోనా తో మరో వ్యక్తి మృతి, డాక్టర్ పై దాడి, total 7corona deaths in TS

 గాంధీ ఆసుపత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు . దీంతో total 7corona deaths in TS కరోనా మరణాల సంఖ్య ఏడుకి చేరింది . నిర్మల్ పట్టణానికి చెందిన అన్న దమ్ములు కరోనా లక్షణాలతో మంగళవారం గాంధీలో చేరారు .

 చికిత్స పొందుతూ తన అన్న చనిపోవడంతో total 7corona deaths in TS తట్టుకోలేక కరోనా పక్క వార్డులో ఉన్న మృతుడి తమ్ముడు వైద్యులపై , సెక్యూరిటీ గార్జులపై దాడికి పాల్పడ్డాడు . దీంతో అక్కడ ఉన్న సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . ఘటనా స్థలికి చేరుకున్న సిసి అంజనీకుమార్ పరిస్థితిని చక్కదిదారు .

 ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు . ఇదిలా ఉండగా ఈ దాడిని సూపరింటెండెంట్ ఖండించారు . క్లిష్ట పరిస్థితులలో సేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం సరికాదన్నారు . చనిపోయిన వ్యక్తి వయస్సు 50 ఏళ్లు ఉన్నట్లు సమాచారం.

 గాంధీ ఆసుపత్రిలో జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటనలో తెలిపారు . ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితులలో క్షమించమని , దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు . డాక్టర్లు , వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏమిటని ? ఆయన ప్రశ్నించారు.

 డాక్టర్ పై దాడి చేయడం హేయ మైన చర్యని , ఇలాంటి గట్టు సమయంలో ఈ ఘటనలు మంచివికావన్నారు . 24 గంటలు డాక్టర్లు ప్రజలు కోసం పనిచేస్తున్నారని , వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు . ప్రతి డాక్టర్‌కు రక్షణ కల్పిస్తామని , భరోసాతో పనిచేయాలని , మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి తెలిపారు .

Related Articles

Back to top button