రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉదృతి, COVID19 cases details in TS
కరోనా మహమ్మారి తో మృతి చెందుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతోంది. COVID19 cases details in TS శుక్రవారం ఏకంగా ఏడుగురు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారు . దీంతో మృతుల సంఖ్య 235 కు చేరుకుంది . కరోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది .
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతోంది . ప్రతిరోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఏ రోజుకారోజు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు . తాజాగా శుక్రవారం తెలంగాణలో 985 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ల్త్ బులెటిన్లో పేర్కొంది . పాజిటివ్ కేసుల సంఖ్య 12,349 కి చేరుకున్నాయి . శుక్రవారం 4,374 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 985 మందికి కరోనా మహమ్మారి సోకినట్టు తేలింది . 3,389 మంది ఫలితాలు నెజిటివ్ గా వచ్చాయి . ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,308 కరోనా పరీక్షలు నిర్వహించగా 12,309 మంది కరోనా బారిన పడ్డారు . శుక్రవారం మరో 78 మంది కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయి ఇళ్ళకు వెళ్ళారు . ఇప్పటి వరకు 4,766 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది .
COVID19 cases details in TS ::
కరోనా సోకిన 7,436 మంది ఇప్పటికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు . జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి . కొత్తగా నమోదైన 985 కేసుల్లో 774 జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది . అటు గ్రామీణ జిల్లాల్లోనూ కరోనా ప్రమాదకర రీతిలో వ్యాపిస్తోంది . సాధారణంగా ఇప్పటి వరకు ఒకటి , రెండు పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో రూ శుక్రవారంనాడు పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది . మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోనూ ఒకే రోజు ఏడుగురు కేసులు నమోదు కావడంపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి .
జిల్లాల వారీగా శుక్రవారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి . రంగారెడ్డి జిల్లాలో 86 , మేడ్చల్ 58 , వరంగల్ అర్బన్ 20 , మెదక్ 9 , ఆదిలాబాద్ జిల్లాలో ఏడు , నాగర్ కర్నూలు , రాజన్న సిరిసిల్ల , నిజామాబాద్ జిల్లాల్లో ఆరు , సిద్దిపేట , భూపాలపల్లి , ఖమ్మం జిల్లాల్లో మూడేసి కేసుల చొప్పున , జగిత్యాల , ములుగు , యాదాద్రి – భువనగిరి జిల్లాల్లో రెండు కేసుల చొప్పున , వికారాబాద్ , మహబూబ్ నగర్ , మిర్యాలగూడ ఒక పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి .
4 Comments