తెలంగాణలో కరోనా విలయతాండవం, Telangana COVID19 updates

 Telangana COVID19 updates రాష్ట్రంలో కోవిడ్- 19 ఉధృతి కొనసాగుతూనే ఉంది . కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరు తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది . కరోనా తో ఆదివారం నాటికి వివిధ ఆసుపత్రుల్లో 9000 మంది చికిత్స పొందుతున్నారంటే రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఎంత ప్రమాదకరస్థాయిలో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు .

 ఆదివారం కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య , ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది . ఆదివారం మొత్తం 3227 శాంపిళ్లను పరీక్షించగా అందులో 988 మందికి వైరస్ సోకినట్లు తేలింది . కొత్తగా నమోదైన 983 కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 14,419 కు చేరుకుంది . కరోనా సోకి చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న 244 మంది ఆదివారం డిశ్చార్జి అయ్యారు .

Telangana COVID19 updates ::

ఇప్పటివరకు 5,172 మందికరోనాకు చికిత్స పొంది కోలుకున్నారు . కరోనా సోకిన మరో నలుగురు చికిత్స తీసుకున్నా ప్రాణాలు నిలుపుకోలేకపోయారు . ఆదివారం నలుగురు కరోనాతో మృతిచెందినట్లు హెల్త్ బులిటెన్లో వైద్య , ఆరోగ్యశాఖ పేర్కొంది . ఇప్పటివరకు 247 మంది కరోనాకు బలయ్యారని తెలిపింది .

 మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తగ్గు ముఖం పట్టడమన్న ఊసే కనిపించడం లేదు . ప్రతిరోజూ నమోదవుతున్నట్లే ఆదివారమూ ఏకంగా 816 పాజిటివ్  కేసులు నమోదయ్యాయి . గ్రామీణ జిల్లాల్లో ఆదివారం కరోనా విజృంభించింది . రంగారెడ్డిలో 47 , మంచిర్యాలలో 33 , మేడ్చల్ లో 29 , వరంగల్ రూరల్ లో 19 , వరంగల్ అర్బన్లో 12 , భద్రాద్రి కొత్తగూడెంలో 5 , నల్గొండ , కరీంనగర్ , సిద్ధిపేట , ఖమ్మం జిల్లాల్లో మూడేసి కేసుల చొప్పున , గద్వాల , ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున , సంగారెడ్డి , మహబూబ్ నగర్ , జనగామ , మెదక్ , సూర్యా పేట , నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి .

Related Articles

Back to top button