ఆగస్టులో రానున్న కరోనా వాక్సిన్, Coronavirus vaccine development

 ప్రపంచానికే శుభవార్త ఇది . Coronavirus vaccine development గత నాలుగైదు మాసాలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పీడ విరగడయ్యే మందు రాబోతోంది . ప్రపంచ మంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ తొలిగా హైదరాబాద్ గడ్డనుండే రాబోతోంది .

 భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పంద్రాగస్టు కల్లా రెడీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి . ఈ వ్యాక్సిన్ ఫార్ములా , ఇప్పటిదాకా జరిగిన ట్రయల్స్ ఫలితాలతో అత్యంత విశ్వాసంగా ఉన్న ఐసీఎంఆర్ పంద్రాగస్టు లోగా .. దీనిని ఆవిష్కరించాలని భారత్ బయోటెక్కు లేఖ రాసింది . ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అండ్ రీసెర్చ్  ( ఐసిఎంఆర్ ) , పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్వెకాలజీ సహకారంతో భారత్ బయోటెక్ ఈ కోవ్యాక్సిన్ ను తయారుచేస్తోంది . మానవులపై కో – వ్యాక్సిన్ ప్రయోగాలు సఫలమైతే .. ప్రపంచలోనే అత్యుత్తమ , సమర్ధవంతమైన వ్యాక్సిన్ గా ఇది నిలవనుంది .

Coronavirus vaccine development ::

 హైదరాబాద్ అడ్డాగా ఆగస్టులో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రాబోతున్నదంటూ సంకేతాలను ఐసీఎంఆర్ ఇచ్చింది . ఇప్పటివరకు జంతువులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కాగా , ఇపుడు మానవ ట్రయల్స్ జరుగు తున్నాయి . ఇప్పటికే ప్రయోగదశలో ఉన్న 12 సంస్థలకు టెస్టు వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ కోరింది . స్వాతంత్ర్య దినోత్సవం కల్లా కరోనాపై భారత్ విజయం సాధిస్తుందని ఐసీఎంఆర్ ధీమా వ్యక్తం చేస్తోంది . వ్యాక్సిన్ మావన ప్రయోగాల దశకు వచ్చిందని , ప్రయోగాలన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయని , వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు పనిచేస్తున్నారని చెబుతోంది .

 ఇక అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జిడస్ క్యాడిల్లా హెల్త్ కేర్ సంస్థకు కూడా ఐసీఎంఆర్ శుక్రవారం అనుమతినిచ్చింది . ప్రపంచంలోని అనేక వ్యాక్సిన్ సంస్థలు వ్యాక్సిన్ కోసం వందలు , వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాయి . పంద్రాగస్టుకు సిద్ధం కావాలి మానవట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్ కు పంద్రాగస్టు కల్లా వ్యాక్సిన్ లాంచ్ చేయాలని కోరుతూ ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ భారత్ బయోటెక్ సంస్థకు లేఖ రాసినట్లు తెలుస్తోంది . ఇది అంతర్గత కమ్యూనికేషన్ కోసం రాసిన లేఖని ఐసిఎంఆర్ వర్గాలు దృవీకరించాయి .

Coronavirus vaccine development ::

 భారత్ బయోటెక్ మాత్రం మానవట్రయల్స్ విజయవంతమయ్యాక .. దీనిపై ఐసిఎంఆర్ , భారత ప్రభుత్వం వివరాలు చెబుతాయని భారత్ బయోటెక్ అంటోంది . బారత్ బయోటెక్ తో దేశంలో మొత్తం 12 సంస్థలు ఈ రేసులో ఉన్నాయి . అయితే భారత్ బయోటెక్ మాత్రం అన్నింటికన్నా ప్రస్తుతం ముందంజలో ఉంది . మానవ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమైతే .. ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి .

వ్యాక్సిను సంబంధించి సంకేతాలున్న నేపథ్యంలో ఇటీవల ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలన్న అంశంపై సమావేశం నిర్వహించారని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి . మంత్రి కేటీఆర్ కూడా ప్రపంచ ఫార్మా హబ్ హైదరాబాదేనని , కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నుండే వస్తోందని ఇప్పటికే ప్రకటించారు . వ్యాక్సిన్ రేసులో హైదరాబాద్ దిగ్గజ కంపెనీ ముందువరుసలో నిలవడం , వచ్చే నెలలోనే వ్యాక్సిన్ వస్తుందన్న నేపథ్యంలో తెలుగుప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి .

Related Articles

Back to top button