మంచిర్యాలలో కరోనా విజృంభణ, Corona cases in mancherial

జిల్లాలో కొవిడ్ -19 వైరస్ విజృంభిస్తోంది . ఆదివారం ఒక్కరోజే 34 Corona cases in mancherial కేసులు నిర్ధారణ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు . జిల్లా వ్యాప్తంగా 110 కేసులుగా వైద్యాధికారులు ధ్రువీకరించారు . ఏప్రిల్ 14 న చెన్నూర్ మండలం ముత్తరావుపల్లికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించింది . ఆమె మరణించిన అనంతరం పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది . అప్పటి నుంచి జిల్లాలో కరీనా పాజిటివ్ ప్రారంభమైంది .

Corona cases in mancherial ::

 జన్నారం , దండేపల్లి , హాజీహర్ , లకైట్టిపేట ప్రాంతాలకు చెందిన ముంబై వలస కూలీలు స్వగ్రామాలకు చేరుకున్నారు . వలస కూలీలలో 38 మందికి పాజిటివ్ వచ్చింది . వారి కుటుం బ సభ్యులు ఒక ఆసుపత్రిలో చేరగా ముగ్గురికి పాజీటివ్ అని తేలింది . బెల్లంపల్లిలోని ఒక బొగ్గుగని కార్మికునికి , క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు కానిస్టేబుల్ కు పాజిటివ్ అని తేలింది . మంచిర్యాలలో ఒక నర్సింగ్ హోం వైద్యుని కి పాజిటివ్ అని తేలింది . దీంతో ఆ ఆసుపత్రిని క్వారం టైన్ చేశారు . మరో ఆసుపత్రిని కూడా క్వారంటైన్ చేశారు .

 ఈ నేపథ్యంలో మంచిర్యాలలోని వస్త్ర వ్యాపారి హైదరాబాదు వెళగా అక్కడ అనారోగ్యం పాలు కావడంతో చికిత్స చేసుకుం టున్న సందర్భంలో పాజిటివ్ అని తేలింది . అందులో వారి కుటుంబ సభ్యులు ముగ్గురికి సోకింది . బెల్లంపల్లిలోని గని కార్మికుని ప్రైమరీ కాంటాక్ట్ ఏకంగా 2 మందికి పాజిటివ్ తేలగా , ఎల్లంపల్లి సమీపంలోని చాకపల్లిలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మహిల ద్వారా 9 మందికి పాజిటివ్ వచ్చింది . తాజాగా శుక్ర , శనివారాలలో 71 మంది నమూనాలను పంపించగా అందులో 1 మందికి ఆదివారం పాటిజివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు . జిల్లాలో ఆదివారం నాటికి 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . నెల రోజుల క్రితం వరకు ఒక్క పాజిటివ్ కేసు లేని మంచిర్యాల పట్టణంలో భారీగా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు . మాస్క్ లేకుండా బయటకు రావద్దని వైద్యాధికారులు , పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు . కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద గల మహారాష్ట్ర , తెలంగాణకు సంబందించిన రాపనపల్లి చెకపోస్ట్ వద్ద కట్టుదిట్టమైన వైద్య పరీక్షలు చేస్తున్నారు .

Related Articles

Back to top button