మంచిర్యాలలో వైద్యునికి సోకిన కరోనా, COVID19 cases in mancherial
మంచిర్యాల జిల్లాలో మొదటిసారిగా వైద్యుడికి కరోనా సోకింది. COVID19 cases in mancherial ఇటీవల బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా అంతకుముందు అనారోగ్యంతో స్థానిక జన్మభూమినగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు . దాదాపు రెండు రోజులపాటు సంబంధిత వ్యక్తికి వైద్యం అందించిన వైద్యుడికి బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది . ఆయన నమూనాను హైదరాబాద్లోనే సేకరించి పరీక్షించారు . ప్రస్తుతం అక్కడే ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది .
వైరస్ అంటుకున్న వైద్యుడి ఆసుపత్రి నివాస సముదాయంలో ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు . గతంలో చికిత్స పొందిన బాధితుడికి పాజిటివ్ అని తేలిన తర్వాత కూడా ఆసుపత్రిలో మరికొంతమందికి వైద్యమందించినట్లు అనుమానిస్తున్నారు. ( COVID19 cases in mancherial ) వైద్యుడితో సంబంధం ఉన్న పదకొండుమందిని గుర్తించి నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరి నమూనాలు గురువారం సేకరిస్తున్నట్లు సమాచారం . ఈ పదకొండు మందిలో సిబ్బంది మాత్రమే ఉన్నారు . వైద్యులు సైతం ఉన్నా అందుబాటులో లేనట్లు చెబుతున్నారు .
బెల్లంపల్లి పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్ర మత్తమైంది . దీంతో వీలైనన్ని ఎక్కువ నమూనాలను సేకరిస్తున్నారు . బుధవారం సర్వేలో గుర్తించిన 48 మంది అనుమానితుల నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపించారు . రిపోర్టులు ఈ నెల 28 న రానున్నట్లు ఐసోలేషన్ ఇన్ ఛార్జి డా.కుమారస్వామి తెలిపారు . ఐసో లేషన్ కేంద్రంలో రెండు వారాల నుంచి చికిత్స పొందు తున్న కరోనా రోగులను బుధవారం డిశ్చార్జి చేశామన్నారు . తీవ్రమైన లక్షణాలుంటేనే గాంధీకి తరలిస్తున్నా మని తెలిపారు .