ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి, Delete chaina mobile apps
కేంద్ర ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ( Delete chaina mobile apps ) దేశ సరిహద్దుల్లో ఘటనలు , జవానుల మృతితో ప్రజల భావోద్వేగాలకు అనుగుణగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాన్ చైనా యాప్స్ ప్రచారాన్ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ( టీటా ) నిర్వహిస్తోంది . చైనాకు చెందిన యాప్స్ సహా వివిధ ఐటి సేవల విషయంలో జరుగుతున్న డేటా మోసాలు , రక్షణ సంబంధమైన అంశాల విషయంలో కేంద్ర మార్గదర్శకాలకు తగినట్లుగా ప్రజలను చైతన్యం చేయడంతో పాటుగా భారతీయ యాప్స్ ఆవిష్కరించడం , సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది .
చైనాతో లింక్ ఉన్న 52 మొబైల్ ఆప్లికేషన్లను బ్లాక్ చేయాలని లేదా వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపినివ్వాలని సూచనలు చేశారు . ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ లో , జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ , కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా సిఫార్సు లపై జూమ్ వాడకంపై హోం మంత్రిత్వ శాఖ ప్రజలకి కొన్ని సూచనలు చేసింది . దీంతో టీటా ఆధ్వర్యంలో బ్యాన్ చైనా యాప్స్ అనే హ్యాష్ ట్యాగ్ లో ప్రచారం నిర్వహిస్తోంది . చైనాకు చెందిన యాప్ వల్లే కలిగి నష్టాన్ని వివరిస్తోంది . చైనీస్ డెవలపర్లు , అభివృద్ధి చేసిన లేదా , చైనీస్ లింక్ లతో కంపెనీలు ప్రారంభించిన అనేక ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యాప్లు స్పైవేర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది , చైనా యాప్స్ సైబర్ భద్రతను గాలికి వదలేయడం , సున్నితమైన సమాచారాన్ని సరైన రీతిలో భద్రపర్చకపోవడం వంటి అంశాలను తెలియజేసింది .
Delete chaina mobile apps ::
- TikTok
- Kwai
- PUBG
- Helo
- Like
- Shareit
- Sharechat
- Xender
- Vigo
- Bigo
- Live Me
- UC Browser
- CM Browser
- Vigo Video
- Viva Video
- VMate
- Beauty Plus
- Baidu Map
- Applock
- Parallel Space
- UDictionary
- DU Battery Saver
- TurboVPN
- NewsDog
- Cam Scanner
- Club Factory
- Mi Store
- Oppo Store
- Vivo Store
- ES File Explorer
- Cheetah Mobile
- Clean Master
- Zoom
- Shein
- Wish
- AliExpress
- Clash of Kings
- Mafia City
- Mobile Legends
- Castle Clash
టిక్ టాక్ , షేరిట్ , యుసి బ్రౌజర్ , బ్యూటీ ప్లస్ సహా 50 చైనా యాత్తు దేశ భద్రతకు ముప్పు అని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి . ఇది మాత్రమే కాదు , మహిళల షాపింగ్లు , షెన్ ( షియన్ ) , క్లబ్ ఫ్యాక్టరీలను కూడా భద్రత విషయంలో చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తోంది . భద్రతా సంస్థల ప్రకారం , ప్రజల వ్యక్తిగత డేటా , అనేక ముఖ్యమైన సమాచారం చైనీస్ యాప్ ద్వారా లీక్ అయ్యే అవకాశం ఉంది . ఈ యాప్ లను ఉపయోగించే భారతీయుల ప్రతి డేటాను తస్కరిస్తాయని , భద్రత డేటా భారతదేశం వెలుపలకు వెళ్లే అవకా శముందని సంస్థలు హెచ్చరిస్తున్నాయి . చైనీస్ యాప్లను నడుపుతున్న కంపెనీలు డేటా ట్యాంపరింగ్ ను కొట్టిపారేస్తున్నాయి . ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రమాదకరమైనవి అని చెప్పే 50 చైనీస్ యాప్ లలో టిక్ టాక్ , హలో , యుసి బ్రౌజర్ , యుసి న్యూస్ , లైకీ , జూమ్ వంటివి ఉన్నాయి .
One Comment