చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం, corona patients selfie video

ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం 24 గంటలు గడవక ముందే మరో వ్యక్తి మృతి. corona patients selfie video బయట పడింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది . సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిసూ మరో వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు . వివరాల్లోకి వెళితే .. డాక్టర్లు పట్టించు కోవడం లేదంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన రవికుమార్ .. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే . ప్రాణాలు కోల్పోవడానికి ముందు రవికుమార్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గామారింది .

corona patients selfie video ::

 ఈ ఘటనజరిగి 48 గంటలు గడవక ముందే మరో వ్యక్తి కూడా అదేరీతిలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది . తనకు వైద్యం చేయడం లేదని సెల్ఫీవీడియో తీసుకుని సయ్యద్ నే వ్యక్తి చనిపోయాడు . తీవ్ర అనారోగ్యం ఉన్న తనను పట్టించు కోవడం లేదని సయ్యద్ ఆ వీడియోలో పేర్కొన్నారు . మరో వైపు సయ్యద్ సోమవారం ఉదయం మరణించినప్పటికీ .. ఇప్పటి వరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి వర్గాలు  కుటుంబసభ్యులకు అప్పగించలేదు . దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు . కాగా , చెస్ట్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్సపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి .

 తెలంగాణలో 15 వేలు దాటిన కరోనాకేసులు 24 గంటల్లోనే 975 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు రోజురో జుకు పెరుగుతున్నాయి . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి . దీంతో మొత్తం కేసుల సంఖ్య 15 , 394 కి చేరింది . ఈమేరకు సోమ వారం రాత్రి తెలంగాణ వైద్య , ఆరోగ్య శాఖ కరోనా పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది . రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 5,582 మంది డిశ్చార్జికాగా , ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి . కరోనాతో మరో 6 గురు మృతి చెందడంతో .. మొత్తం మృతుల సంఖ్య 253 కి చేరింది . తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 861 ఉన్నాయి . 

Related Articles

Back to top button