Trending

మొబైల్ ప్రియులకు కేంద్రం షాక్, Bad News for mobile lovers

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ Bad News for mobile lovers మొబైల్ ప్రియులకు షాకిచ్చింది . బడ్జెట్ 2021 ప్రసంగంలో మొబైల్ విడిభాగాలపైన 2.5 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు . అలాగే ఆయా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పేర్కొన్నారు . ఈ నిర్ణయం వల్ల ఫోన్లు , ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు . ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి , మదర్ బోర్లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి , మొబైల్ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు . మొబైల్ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్ వెల్ఫేర్ సెస్ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు .

Bad News for mobile lovers

మొబైల్ ఫోన్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన భాగాలు , ఉప భాగాలపై ఇప్పటివరకు ఎటువంటి పన్ను విధించలేదు . కానీ , ఇప్పుడు 2.5 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు పేర్కొన్నారు . ఇదిలా ఉంటే .. దేశీయంగా ఫోన్లు , ఎలక్ట్రానిక్ పరికరాలు , సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది . ప్రపంచ ఉత్పత్తి గొలుసులో భారత్ ను భాగస్వామిగా చేసేందుకు , ఉద్యోగావకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది . మేకిన్ ఇండియా విధానంలో భాగంగానే మొబైల్ ఫోన్లు , ఎలక్ట్రిక్ వాహనాలు , వాటి విడిభాగాలపై కస్టమ్స్ సుంకాల రేట్లలో పెరుగుదల ఉంటుంది . ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తి సామర్ధ్యం పెరగనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు . ఐతే దిగుమతి సుంకంలో పెరుగుదల ప్రభావం వినియోగదారులపై అంతగా ఉండకపోవచ్చని .. దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్ 97 శాతం అవసరాలు స్థానిక ఉత్పత్తుల వల్లనే సరిపోతాయని కొందరు పరిశీలకులు అంటున్నారు .

Related Articles

Back to top button