ఒక్క ట్వీట్ తో 10 లక్షల కోట్లు ఆవిరి, Elon Musk tweet costs billions

ఒక్క Elon Musk tweet costs billions తో రూ . 10 లక్షల కోట్లు హాంఫట్ టెస్లా కొంపముంచిన ఎలాస్ మస్క్ , ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ కంపెనీకి భారీ నష్టాన్ని మిగిల్చింది . గంటల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ విలువ 14 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ . 10 లక్షల కోట్లు ) మేర క్షీణించింది . నా అభిప్రాయంలో టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ అని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు . కష్టాల్లో ఉన్న టెస్లా కంపెనీ నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తోందని మదుపర్లు భావించారు . ఒక్కసారిగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు .

 ట్వీట్‌కు ముందు 141 బిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా మార్కెట్ విలువ గంటల వ్యవధిలోనే 127 బిలియన్ డాలర్లకు పడిపోయింది . ఎలాన్ మస్క్ చేసిన ఈ Elon Musk tweet costs billions ఆయన సొంత సంపద 3 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది . అంతేకాదు టెస్లా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది . అంతేకాకుండా కంపెనీతో సంప్రదించకుండా కంపెనీపై ట్వీట్ చేసినందుకుగానూ యూఎస్ సెక్యూరిటీస్ , ఎక్స్చేంజ్ కమిషన్ ( ఎఈసీ ) కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి .

 నిధుల సేకరణ ఉద్దేశ్యంతోనే మీరీ ట్వీట్ చేశారా అని ఓ వ్యక్తి ట్విట్టర్ లో మస్క్ ను ప్రశ్నించాడు . తనకు డబ్బు అవసరం లేదని మస్క్ రిపై ఇచ్చాడు . ఇదిలావుండగా 2018 ఆగస్టులో ఒకసారి ఎలాన్ మస్క్ చేసిన ఓట్వీట్ కంపెనీలో ప్రకంపనలు రేపింది . గోయింగ్ ప్రైవేటు , ఫండింగ్ సెక్యూర్యుడ్ అని ఆయన ట్వీట్ చేస్తే 420 డాలర్లుగా ఉన్న ఒక్కో షేరు ధర అమాంతం ఒక్కసారిగా 6 శాతం మేర వృద్ధి చెందింది .

 అయితే ఇదే టెస్లా కంపెనీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది . షేర్ల విలువ పెంచుకునేందుకు మోసానికి పాల్పడ్డారని ఎస్ఈసీ 40 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది . అంతేకాకుండా ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ చైర్మన్ పదవి కూడా ఊడిపోయింది . ప్రస్తుత ట్వీట్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచిచూడాలి . 

Back to top button