Trending

ఆంధ్రప్రదేశ్ ను పగ పట్టిన కరోనా, AP COVID19 cases

 AP COVID19 cases రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. ఆదివారం రోజు కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 2వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు లక్షా 73 వేల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

 రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదు . తాజాగా రాష్ట్రంలో కొత్తగా 50 కేసులు బయటపడ్డాయి . గత 24 గంటల్లో మొత్తం 8 , 666 నమూనాలను పరీక్షించగా , ఈ కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి . దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1 , 980కు చేరుకుంది . తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలులో 13 , చిత్తూరు లో 16 , అనంతపురంలో 5 , గుంటూరులో 6 , నెల్లూరు లో 5 , ప్రకాశంలో 2 , కడపలో 1 , విశాఖలో 1 , కృష్ణా జిల్లాలో ఒక కేసు చొప్పున నమోద య్యాయి . మరో వైపు రాష్ట్రంలో మరో కరోనా బాధితుడు ( కర్నూలు ) మృతి చెందాడు .

 దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరుకుంది . కాగా ఇప్పటి వరకు 925 మంది కరోనా బాధితులు కోలుకుని , డిశ్చార్జి అయ్యారు . ప్రస్తుతం 1 , 010 యాక్టివ్ కేసులు AP COVID19 cases  ఉన్నాయి . మరో 20 కేసులు నిర్ధారణ అయితే పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరుకుంటుంది . సోమవారం ఉదయం విడుదల చేసే బులిటెన్లో ఈ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది .

 ఇక – ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది . ఇక్కడ మొత్తం 566 కేసులు బయటపడ్డాయి . తర్వాత గుంటూ రులో 382 పాజిటివ్ కేసులు , కృష్ణా లో 339 కేసులు , చిత్తూరులో 112 , అనంత పురంలో 107 , నెల్లూరులో 101 , కడపలో 97 , పశ్చిమ గోదావరిలో 68 , విశాఖలో 63 , ప్రకాశంలో 63 , తూర్పుగోదావరి లో 46 , శ్రీకాకుళంలో 5 , విజయనగరంలో 4 , ఇతరులు 27 కేసులు నమోదయ్యాయి . కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 73వేల 735 మందిని పరీక్షించగా . . ఈ1 , 980 కేసులు నిర్ధారణ అయ్యా యి . అలాగే లక్షా 71వేల 755 నమూనాలకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది .

Related Articles

Back to top button