Trending

తెలంగాణలో కరోనా కలకలం, Telangana Corona Cases

Telangana Corona Cases ఒక్క సారిగా  పెరిగిన కరోనా వైరస్ కేసులు ఒక్కరోజే 79 కేసులు నమోదయ్యాయి, కేసులన్నీ ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. తెలంగాణలో ఇప్పటిదాకా 810మంది డిశ్చార్జి కాగా 30మంది మృతి చెందారు.

Telangana Corona Cases ::

  కరోనా మహమ్మారి రాజధాని హైదరాబాదు హడలెత్తిస్తోంది . నిన్నమొన్నటి వరకు పది , పదకొండు కేసులకే పరిమితమైన జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం ఒక్కరోజే 79 కొత్త పాజిటివ్ కేసులు నమోద య్యాయి . రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు తగుతున్నప్పటికీ హైదరాబాద్ లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది .

 ఈ నేపథ్యంలోనే కరోనా పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది . రెండు రోజులుగా వలస కార్మికులు కరోనాబారిన పడుతున్నారు . కొత్తగా 79 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో వైరస్ సోకిన బాధితుల సంఖ్య 1275కు చేరింది . సోమవారం 50మంది వ్యాధి గ్రస్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు . ఇప్పటిదాకా 801 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని , కరోనాతో ఇప్పటివరకు 30మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు .

కర్ణాటకలో కరోనా బస్సులు … ఇక ఇంటి వద్దే టెస్టులు…

 మర్కజ్ కు వెళ్లివచ్చిన వారిలో ఎక్కువమందికి కరోనా సోకి బాధితుల సంఖ్య ఒక్కోరోజు 80కు కూడా చేరిన సందర్భాలు ఉన్నాయి . కొత్తగా నమోదైన 79 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఏ ప్రాంతానికి చెందినవో అధికారులు వెల్లడించలేదు . ముఖ్యంగా వనస్థలిపురం , ఎల్బీనగర్ , మలక్ పేట , జియాగూడ , నల్లకుంట తదితర ప్రాంతాల్లో కరోనా అనుమానితులను అధికారులు ఆయా ఆసుపత్రులకు తరలించి రక్తనమూనాలు సేకరించారు . ఆదివారం ఒక్కరోజే ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి 50మంది అనుమానితులను తీసుకువచ్చి వారి రక్తనమూనాలను పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పంపించారు . వీరిలో ఎక్కువ మందికి వ్యాధి సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు .

 రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగుముఖం పట్టిందని , మరో పది రోజుల్లో రాష్ట్రం కరోనారహిత తెలంగాణగా మారుతుందన్న ఆశాభావాన్ని వైద్య , ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించి నాలుగు రోజులు తిరగకముందే 79పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది . ఇంకా ఢిల్లీ నుంచి ప్రత్యేక రైలులో వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తే వారిలో ఎంతమందికి పాజిటివ్ తేలుతుందోనన్న భయం అధికారులను వెంటాడుతోంది .

Related Articles

Back to top button