కరోనా కొత్త లక్షణాలు, ఆందోళనలో వైద్యులు, Coronavirus New symptoms

 మానవాళిని కబళిస్తున్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటున్నది . Coronavirus New symptoms ఇప్పటివరకు ఉన్న లక్షణాల స్థానంలో కొత్త లక్షణాలు వచ్చినట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు .

 ఇప్పటి వరకు కరోనాకు ప్రాథమికంగా పొడిదగ్గు , విపరీతమైన జ్వరం , తలనొప్పి , విరేచనాలు వంటి లక్షణాలను అనుమా నితులుగా గుర్తించేందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు .

 కొత్త లక్షణాల్లో ఉన్న కొన్నింటిని బట్టి కరోనా వ్యాధి సోకినట్లుగా అనుమానించొచ్చని వైద్యులు గుర్తించి వెల్లడించారు . పాదాలపై దద్దుర్లు ఉన్నా కరోనాగా అనుమానించేందుకు అవకాశాలు కొట్టిపారేయలేమని , దీనిని అనుమానించేందుకు వీలున్న అవకాశంగా పేర్కొన్నారు.

Coronavirus New symptoms :

 ఇటలీకి చెందిన ఒక అధ్యయనంలో ఈ మేరకు వివరాలు వెలుగులోకి వచ్చాయి . ఈ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ సోకిన ప్రతీ ఐదుగురిలో ఒకరికి చర్మసంబంధ సమస్యలున్నట్లుగా గుర్తించారు . ఈ వ్యాధి సోకిన మెజార్టీ బాధితుల్లో చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని , దీనిని కోవిడ్ ఫీట్ అంటారని వైద్య నిపుణులు వెల్లడించారు .

 ఇటలీలో దాదాపు 20 శాతం కేసుల్లో ఈ తరహా లక్షణాలు కనిపించాయని అధ్యయనంలో వెల్లడైంది . ఫిన్లాండ్ , స్పెయిన్ , అమెరికా , కెనడాలోని వైద్యులు కూడా కరోనా బాధితుల్లో ఎర్రటి దద్దుర్లను గమనించారని తెలిసింది . దీంతో ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన కొత్త లక్షణాల ప్రకారమే మన దేశంలో కూడా కరోనా రోగులను ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .

 రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని , సెకండరీ కాంటాక్టులకు ప్రాథమిక స్థాయిలో పరీక్షలు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే . దీంతో లక్షణాలు కనిపించకుండా రోగగ్రస్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవు తోంది .

 ఈలోగా ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తే వీరు ప్రాంతాల్లో సంచరించి వైరస్ వ్యాప్తికి కారకులు కావొచ్చనే ఆందోళన తీవ్రమవుతున్నది . ఈ దిశలో కొత్త లక్షణాలను గుర్తిస్తే అడ్డుకట్ట వేయొచ్చని , ఇదే మేలైన పరిష్కార మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు .

అధ్యయనాలు::

  వివిధ దేశాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ బాధితుల్లో నొప్పితో కూడిన దద్దుర్లు ఎక్కువగా పాదాలు , కాళ్ల బొటనవేళ్లతో పాటుగా కొన్నిసార్లు చేతులపై కూడా వస్తున్నాయని వెల్లడైంది . ఇవి విపరీతమైన చలి ఉన్న సమయంలో కాలి వేళ్లు ఉబ్బిన తీరులో ఉన్నాయని గుర్తించారు . అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని , ఇలాంటి తరహా లక్షణాలు భారత్ లో ఎక్కువగా వెల్లడి కాలేదని నిపుణులు పేర్కొంటున్నారు .

 కాగా గత వారం దద్దుర్లతో పాటు , విపరీతమైన జ్వరంతో వైద్యుడి వద్దకు వచ్చిన దంపతులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయినట్లు తెలిసింది . ఈ నేపథ్యంలో దద్దుర్లతోపాటు , జ్వరం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అంతర్జాతీయ అధ్యయన నివేదిక వెల్లడించింది . 

 ఎటువంటి లక్షణాలు లేకున్నా ఈ రెండు నెలల కాలంలో ప్రపంచమంతటా కరోనా వ్యాధి గ్రస్తులు పెరిగి నట్లు , వారిని గుర్తించడంలో జాప్యం తలెత్తినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది . అయితే తాజాగా వైద్యులు కరోనాకు మరికొన్ని లక్షణాలను గుర్తించారు .

Related Articles

Back to top button