మంచిర్యాల జిల్లాలో పెరిగిన కరోనా కేసులు, Mancherial COVID19 cases
మంచిర్యాల జిల్లాలో సోమవారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. Mancherial COVID19 cases శనివారం 36 నమూనాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపగా సోమవారం ఫలితాలు వచ్చాయి . ఇందులో 31 మందికి నెగె టివ్ రాగా , బెల్లంపల్లి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు , మంచిర్యాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది . ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వీరికి వైరస్ సోకిందని వైద్యులు తెలిపారు . ఇప్పటివరకు జిల్లాలో 55 మందికి కరోనా పాజిటివ్ సోకగా 36 మంది వలస కూలీలు , వారి కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు . స్థానికుల పాజిటివ్ సంఖ్య 18 గా ఉందని కరోనా పర్యవేక్షణ అధికారి తెలిపారు .
Mancherial COVID19 cases ::
బెల్లంపల్లిలో 11 కు చేరిన కేసులు బెల్లంపల్లిటౌన్ . బెల్లంపల్లి పట్టణవాసులను కరోనా వైరస్ భయపెడుతోంది . సోమవారం 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 11 కు చేరింది . బొగ్గుగని కార్మికునికి ఇటీవల కరోనా పాజిటివ్ రాగా అనుమానంతో ఆయనను కలిసిన వ్యక్తులు , సదరు కార్మికుని కుటుంబ సభ్యులు 36 మంది నమూనాలు ఎంజీఎంకు పంపారు . సదరు కార్మికుని భార్యతోపాటు ఇద్దరు పిల్లలకు వైరస్ సోకినట్లు వైద్యులు పేర్కొన్నారు . తాజాగా స్టేషన్ రోడ్ కాలనీకి చెందిన కార్మికుని కుటుంబీకుల్లో ముగ్గురికి పాజిటివ్ గా తేలడంతో అధికార యంత్రాంగం అప్ర మత్తమైంది . కరోనా నియంత్రణలో భాగంగా మెయిన్ బాజార్ , కాల్ టెక్స్ , రైల్వేస్టేషన్ ఏరియా , చౌడేశ్వరి ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు ఉదయం 9 నుంచి సా యంత్రం 5 వరకే తెరిచి ఉంచుతున్నారు . రెవెన్యూ , మున్సిపల్ , వైద్య ఆరోగ్యశాఖ , సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .
2 Comments