కరోనా మొదటి ప్రయోగ చికిత్స విజయవంతం, Plasma treatment for coronavirus

 కరోనా వైరసన్ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స Plasma treatment for coronavirus మంచి ఫలితాన్ని ఇస్తుంది . వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి .

 ప్లాస్మా మార్పిడి చేసిన దేశంలోని తొలి ఆస్పత్రిగా అహ్మదాబాద్లోని ఎస్వీపీ హాస్పిటల్ నిలిచింది . ఈ మేరకు సోమవారం అర్థరాత్రి సమయంలో ఐసీఎంఆర్ తో ఒప్పందం చేసుకుంది . అదే రోజు రాత్రి తొలి రక్తమార్పిడి ప్రక్రియ విజయ వంతంగా ముగిసింది .

 మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా మాట్లాడుతూ  Plasma treatment for coronavirus మార్పిడి అనేది ఓ వివరణాత్మక పరిశోధన ప్రక్రియ అని , దీనికి ఎస్వీపీ అధ్యయన కేంద్రంగా నిలిచిందని అన్నారు . మంగళవారం ఉదయం రెండో ప్లాస్మా మార్పిడి ప్రక్రియ ప్రారంభమై సాయంత్రానికి పూర్తయ్యిందని వివరించారు.

 కరోనా రోగికి కొన్ని రోజుల పాటు వెంటిలేటపై ఉంచడం జరిగిందని , ప్లాస్మా చికిత్స తరువాత రెండు పరీక్షలు నిర్వ హించగా పాజిటివ్ వచ్చిందని , దీంతో అతన్ని ఎసీవీపీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని కమిషన్ తెలిపారు . ఎస్వీపీ ఆస్పత్రిలో సాధారణంగా అయితే 500 రోగుల సామర్థ్యం మాత్రమే ఉందని , కానీ ప్రస్తుతం దాన్ని 1000కు పెంచినట్టు తెలిపారు .

 ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు . ఎజ్ హైవే పై  ఉన్న ఫైవ్ స్టార్ హోట లను తమ ఆధీనంలోకి తీసుకుని  కోవిడ్ – 19 కేర్ సెంటర్‌గా మార్చామని తెలిపారు . త్వరలో హజ్ హౌస్ను కూడా కోవిడ్ – 19 కేర్ సెంటర్‌గా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మారుస్తుందన్నారు .

Related Articles

Back to top button