మర్కజ్ కారణంగా తెలంగాణలో కరోనా విజృంభణ, 766 +ve cases in TS

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 766 +ve cases in TS పాజిటివ్ కేసుల్లో 45 మినహా మిగతావన్నీ మర్కజ్ నుంచి వెళ్లి వచ్చిన కుటుంబాలకు చెందిన వారేనని వైద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి .

 ఒక్కరి ద్వారానే 20 , 15 , 14 మంది చొప్పున కుటుంబ సభ్యులకు వైరస్ సోకినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశారు . వీరిలో ఆరు నెలల పసికందు నుంచి పదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు.

 రాష్ట్రంలో 10 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా766 +ve cases in TS వారి లో 720 కేసులు మర్కజ్ ప్రయాణికులేనని ప్రభుత్వం తేల్చింది . పాతబస్తీలోని తలాబ్ కట్టలో వైరస్ సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు , సన్నిహితుల్లో 30 మందికి పరీక్షలు జరపగా 20మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

 కరీంనగర్‌లో 84 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 15 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి . హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో 30మందిని పరీక్షించగా 14 కేసులు బయటపడ్డాయి . పాత మల్కపేటలో 26మందిని పరీక్షిస్తే 10మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది . ఆసీనగర్ లో 13మందిలో 10మందికి పాజిటివ్ వచ్చింది.

 శనివారం నుంచి సనత్ నగర్‌లోని ఈఎస్ఎ ఆసుపత్రి , నాంపల్లిలోని ఫోరెన్సిక్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది . పాజిటివ్ సోకిన వ్యక్తులతో కలివిడిగా తిరిగినవారిని గుర్తించి బలవంతంగానైనా ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించాలని , ఇందుకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.

 వైద్యానికి నిరాకరిస్తున్న వారికి నచ్చజెప్పడంతోపాటు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తు  ధైర్యాన్ని , విశ్వాసాన్ని కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 తమకు కరోనా సోకిందన్న విషయం తెలిసి కూడా వారు ఆసుపత్రులకు రావడం లేదని , మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ సోకినా వారు వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్న విషయాన్ని పోలీసులు , వైద్య , ఆరోగ్యశాఖ వర్గాలు కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లినట్లు సమాచారం.

 మర్కజ్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఎంతమందిని కలిసింది , ఎవరెవరితో కలిసి తిరిగారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని , కాని ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది .

Related Articles

Back to top button