డెలివరీ బాయ్ కు కరోనా,72 కుటుంబాలు క్వారంటైన్ కు, Delivery boy tests positive
కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ , దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఓ మటన మరింత బీభత్సాన్ని సృష్టించింది. Delivery boy tests positive పిజ్జా డెలివరి బాయ్ కరోనా వైరస్ బారిన పడినట్లు వచ్చిన వార్తలు , కొన్ని కుటుంబాలను భయాందోళనలకు గురిచేశాయి.
ఆయా కుటుంబాల్లోని వారంత క్యారంటెనక్కు పరుగులు పెట్టేలా చేశాయి . ఆ ఉద్యోగితో పాటు అదే పిజ్జా ఔట్లెట్ లో పని చేస్తోన్న 16 మందిని ఆసుపత్రికి తరలించారు . వారందరికీ పరీక్షలను నిర్వహిస్తున్నారు .
న్యూఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది . ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది . కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండోదశ లాడౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ , ముంబై వంటి మెట్రో సిటీల్లో ఫుడ్ డెలివరీ ఔట్ లెట్లకు డిమాండ్ పెరిగింది.
దీనితో ఆయా ఔట్లెట్ల యజమానులు స్థానిక పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని వుడ్ డెలివరీ చేస్తున్నారు . ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బందికి పోలీసులు కూడా ఎక్కడా అడ్డు చెప్పట్లేదు . ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి వస్తున్నందున ఫుడ్ డెలివరీ సిబ్బంది కార్యకలాపాలను యథాప్రకారం కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని మాలవీయ నగర్‌కు చెందిన 72 కుటుంబాలు 15 రోజులుగా తరచూ పిజ్జాను ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటూ వచ్చారు . ఒకే ప్రాంతం కావడం వల్ల ఒకే వ్యక్తి ఆయా కుటుంబాలందరికీ పిజ్జాను డెలివరీ చేశారు.
ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల తర్వాత , Delivery boy tests positive ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అయ్యారు . ఆయనకు పరీక్షలను నిర్వహించగా , కరోనా వైరస్ సోకినట్లు తేలింది . ఆ డెలివరీ బాయ్ కరోనా వైరస్ పాజిటివ్ గా అధికారులు నిర్ధారించారు.
ఈ వార్తను దక్షిణ ఢిల్లీ ప్రాంత మెజిస్ట్రేట్ బిఎం మిశ్రా తెలిపారు . ఈ విషయం తెలిసిన వెంటనే 72 కుటుంబాల వారు క్వారంటైనుకు పరుగులు పెట్టారు .