తెలంగాణలో 14 కొత్త కేసులు, ఇద్దరు మృతి, Total 872 corona cases in TS

తెలంగాణలో 14 కొత్త కరోనా కేసులు రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి విజృంభిస్తోంది. Total 872 corona cases in TS కరోనా బారిన పడి ఆదివారం 49మంది  ఆసుపత్రిపాలు కాగా సోమవారం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది .

 తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ విడుదలచేసిన ప్రకటన ప్రకారం సోమవారం రాష్ట్రంలో కేవలం 14మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని , వీరందరినీ గాంధీ ఆసుపత్రి క్వారంటైన్ కేంద్రానికి తరలించామని చెప్పారు .

 కరోనా వైరస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 23కు చేరింది . సోమవారం ఇద్దరు మృతిచెందినట్లు ఆ ప్రకటనలో అధికారులు తెలిపారు . ఇప్పటి వరకు తెలంగాణలో 872 Total 872 corona cases in TS కరోనా బారిన పడ్డారని , 186మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారని , 663 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

 జీహెచ్ఎంసీ పరిధిలో 12 కేసులు నమోదు కాగా , నిజామాబాద్ , మేడ్చల్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది . కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన ఇద్దరి వివరాలను రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ వెల్లడించింది .

 ఓ 35 ఏళ్ల మహిళతోపాటు 72 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన ప్రాణాలు విడిచారు . క్యాన్సర్ నాలుగోదశతో బాధపడుతున్న ఓ 35 మహిళ కరోనాబారిన పడి మృతిచెందింది . కరోనా సోకడంతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఓ 72ఏళ్ల వృద్ధుడు  ఆసుపత్రిలో చేరిన ఆరు గంటలలోపే ప్రాణాలు విడిచాడు .

 కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్య , ఆరోగ్యశాఖ సూచించింది . ఇంట్లో తయారు చేసిన డబుల్ లేయర్ మాస్కులు ధరించాలి . ప్రతీ రోజు శుభ్రం మాస్కులను శుభ్రం చేసుకోవాలి . దగ్గు , జలుబు , జ్వరం గొంతు నొప్పి ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి . మర్కజ్ , ఢిల్లీ వెల్లి వచ్చినవారు లేదా ఆ ప్రాంతాలకు వెళ్లి వచ్చినవారిని కలిసిన వారు వెంటనే సమీపంలోని పోలీస్ ప్రభుత్వ ఆసుపత్రిలో రిపోర్టు చేయాలని సూచించారు .

Related Articles

Back to top button